IPL 2026 Mini-auction: జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్‌కు కళ్ళు చెదిరే ధర.. రూ.30 లక్షలతో వచ్చి 8.40 కోట్లతో సంచలనం

IPL 2026 Mini-auction: జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్‌కు కళ్ళు చెదిరే ధర.. రూ.30 లక్షలతో వచ్చి 8.40 కోట్లతో సంచలనం

జమ్మూ కాశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఔకిబ్ నబి దార్ కు ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోట్ల వర్షం కురిసింది. ఈ జమ్మూ కాశ్మీర్ పేసర్ ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ.8.40 కోట్లకు కొనుగోలు చేసింది. మంగళవారం (డిసెంబర్ 16) జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఔకిబ్ దార్ బేస్ ప్రైస్ రూ.30 లక్షలతో ఆక్షన్ లోకి వచ్చి ఏకంగా 8 కోట్లకు పైగా ధర పలకడం ఈ మినీ ఆక్షన్ లో హైలెట్ గా నిలిచింది. ఈ జమ్మూ పేసర్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడ్డాయి. బిడ్డింగ్ వార్ వీరిద్దరి మధ్య చివరి వరకు పోటాపోటీగా సాగింది. చివరకు ఢిల్లీ ఔకిబ్ దార్ ను రూ. రూ.8.40 కోట్లకు దక్కించుకుంది. 

కొన్నేళ్లుగా డొమెస్టిక్ క్రికెట్ లో అకిబ్ దార్ నిలకడగా రాణిస్తున్నాడు. స్వింగ్ బౌలింగ్ తో ప్రత్యర్థిని దడ పుట్టించేవాడు. ప్రస్తుతం జరుగుతున్న ముస్తాక్ అలీ ట్రోఫీలో అకిబ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.  7 మ్యాచ్ ల్లో15 వికెట్లు పడగొట్టి రాణించాడు. మ్యాచ్ విన్నింగ్ స్పెల్ తో ఆక్షన్ లోకి ఒక్కసారిగా దూసుకొచ్చాడు. ఫాస్ట్ బౌలర్ గా ఢిల్లీ జట్టులో స్టార్క్, నటరాజన్, ముకేశ్ కుమార్ లతో పేస్ బౌలింగ్  బాధ్యతలు పంచుకోనున్నాడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అకిబ్ స్పెషలిస్ట్. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో నెట్ బౌలర్‌గా ఉన్నాడు. బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయగల సామర్ధ్యం కూడా ఉంది.