గచ్చిబౌలిలో విషాదం: భారీ వర్షానికి గోడ కూలి ఇద్దరు మృతి

గచ్చిబౌలిలో విషాదం: భారీ వర్షానికి గోడ కూలి ఇద్దరు మృతి

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రహారీ గోడ కూలి ఇద్దరూ మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

వివరాల ప్రకారం.. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లిలో నూతనంగా ఓ కన్వెన్షన్ నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం (సెప్టెంబర్ 14) రాత్రి కురిసిన భారీ వర్షానికి కన్వెన్షన్ ప్రహారీ గోడ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అక్కడే పని చేస్తున్న కూలీలలో ఇద్దరూ మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. నలుగురు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుప్రతికి తరలించారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.