జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎవరనేది AICC డిసైడ్ చేస్తది.: సీఎం రేవంత్

జూబ్లీహిల్స్  అభ్యర్థి ఎవరనేది AICC డిసైడ్ చేస్తది.: సీఎం రేవంత్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ప్రతీ ఒక్కరు కలిసి పని చేయాలని  సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.  జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై  సెప్టెంబర్ 14న తన నివాసంలో  సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశానికి  హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి చర్చించారు రేవంత్ .

 ఈ సందర్భంగా మంత్రులతో మాట్లాడిన రేవంత్.. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుందన్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉందన్నారు.  జూబ్లీహిల్స్ లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటానని చెప్పారు.  ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని సూచించారు.  పోలింగ్ బూత్ ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు.  నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలన్నారు.  కాంగ్రెస్ తోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు రేవంత్. 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు సీరియస్‎గా తీసుకున్నాయి. అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ చూస్తుంటే.. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నెగ్గి రాష్ట్రంలో తమ ప్రభుత్వానికి ప్రజాధరణ ఏ మాత్రం తగ్గలేదని ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇవ్వాలని అధికార కాంగ్రెస్ పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరోవైపు.. గ్రేటర్‎లో తమకు మంచి పట్టు ఉండటంతో జూబ్లీహిల్స్ గడ్డపై కాషాయ జెండా ఎగరేయ్యాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.