వరంగల్ లో వీధి కుక్కల స్వైరవిహారం..ఒకే రోజు 18 మందిపై దాడి

వరంగల్ లో వీధి కుక్కల స్వైరవిహారం..ఒకే రోజు 18 మందిపై దాడి

వీధి కుక్కలు రోజురోజుకు రెచ్చిపోతున్నాయి. నిత్యం ఏదో ఒక చోట చిన్నారులపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. సెప్టెంబర్ 14న  వరంగల్ నగరంలో  ఒకే రోజు 18 మందిపై వీధి కుక్కలు దాడి చేశాయి.  కొందరి కాళ్ల పిక్కలు పట్టి గుంజాయి.. మరికొందరిని నోటికి అందిన కాళ్లు, చేతులను తీవ్రంగా గాయపరిచి భయానక వాతావరణం సృష్టించాయి. కుక్కల భయానికి ప్రజలు రోడ్డుపై నడవాలంటేనే భయపడుతున్నారు డివిజన్ ప్రజలు. ఎన్ని సార్లు చెప్పినా   మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు.  తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

కుక్కలకు టీకాలు, డీవార్మింగ్ చేసి తిరిగి అదే ప్రాంతంలో విడిచివేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎస్ లకు సుప్రీం కోర్టు  ఇటీవల  నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  డాగ్ లవర్స్, ఎన్‌జీఓలు రూ.25,000–2 లక్షలు జమచేయాలని ఆదేశించింది.  ఇదే క్రమంలో షెల్టర్లకు తరలించే కుక్కలను స్టెరిలైజేషన్, రోగనిరోధకతకు సంబంధించిన వైద్యపరమైన ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత వాటిని మళ్లీ విడిచిపెట్టాలని కోర్టు తన  ఉత్తర్వుల్లో పేర్కొంది. రేబిస్ సోకిన లేదా అగ్రసివ్ ప్రవర్తనను కలిగి ఉన్న కుక్కలు తప్ప.. అన్ని వీధి కుక్కలకు ఈ ఉత్తర్వు వర్తిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది. వీధి కుక్కలకు బహిరంగంగా ఆహారం ఇవ్వడం నిషేధించబడిందని చెప్పిన కోర్ట్.. దానిని అతిక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక వీధి కుక్కలకు ఆహారం కోసం ప్రత్యేక దాణా ప్రాంతాలను ఏర్పాటు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.