Mega Star: చిరు ఇంట్లో ‘దోశ’ పండగ.. భోగి వేడుకల్లో రామ్ చరణ్, వరుణ్ తేజ్ హంగామా!

Mega Star: చిరు ఇంట్లో ‘దోశ’ పండగ.. భోగి వేడుకల్లో రామ్ చరణ్, వరుణ్ తేజ్ హంగామా!

మెగాస్టార్ చిరంజీవి ఇంట సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఒకవైపు ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంటే.. మరోవైపు పండగ వేళ కుటుంబ సభ్యులందరూ ఒకే చోట చేరడంతో ‘మెగా’ లోగిలి సరికొత్త కాంతితో మెరిసిపోతోంది. భోగి వేడుకలను మెగా ఫ్యామిలీ అత్యంత ఉత్సాహంగా జరుపుకుంది. చిరు కుటుంబం ఈ ఏడాది భోగిని మరపురాని జ్ఞాపకంగా మార్చుకుంది. ఈ నేపథ్యంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

మెగా బ్రదర్స్ ‘దోశ’ విన్యాసాలు

సాధారణంగా భోగి అంటే భోగి మంటలు, పిండి వంటలు గుర్తుకు వస్తాయి. కానీ మెగా ఫ్యామిలీలో మాత్రం ఇది ‘దోశ డే’గా మారిపోయింది. వైరల్ అవుతున్న వీడియోలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్,  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, , సుస్మిత కొణిదెల ఉత్సాహంగా దోశలు వేస్తూ కనిపించారు. గతంలో చిరంజీవి స్వయంగా దోశలు వేసి వడ్డించే సంప్రదాయాన్ని ఇప్పుడు తనయుడు, మేనల్లుళ్లు కొనసాగించారు. 

ALSO READ : బాక్సాఫీస్ వద్ద మాస్ మహారాజ్ సందడి..

పండగలో ‘శంకరవరప్రసాద్’ జోష్

జనవరి 12న విడుదలైన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే రూ. 120 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో మెగా కుటుంబం ఫుల్ ఖుషీలో ఉంది. భోగి వేడుకల్లో సాయి దుర్గాతేజ్ టీ తాగుతూ ముచ్చటిస్తుండగా, చిరంజీవి, నాగబాబు, ఉపాసన, లావణ్య త్రిపాఠి కూడా ఈ సంబరాల్లో సందడి చేసింది. ఇది కేవలం భోగిలా లేదు.. దోశ రోజులా ఉంది అంటూ నిహారిక సరదాగా క్యాప్షన్ ఇచ్చింది.

ALSO READ : రికార్డుల వేటలో మెగాస్టార్..

సంప్రదాయానికి పెద్దపీట

ఎన్ని షూటింగులు ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా పండగ రోజున అందరూ ఒకే చోట చేరడం మెగా ఫ్యామిలీకి అలవాటు. మా కుటుంబమంతా ఒక చోట చేరి మన సంప్రదాయాలను, పండగలను అద్భుతంగా జరుపుకుంటాం అని నిహారిక పేర్కొన్న మాటలు మెగా అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. గతేడాది వరుణ్ తేజ్ వివాహం తర్వాత జరిగిన మొదటి సంక్రాంతి కావడంతో ఈ వేడుకల్లో సందడి రెట్టింపు అయింది.

ALSO READ :  ‘అనగనగా ఒక రాజు’ రివ్యూ

మొత్తానికి.. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ ‘మాస్’ వినోదాన్ని పంచుతుంటే, ఇంట్లో మాత్రం మెగా వారసులు ‘క్లాస్’గా వంటలు చేస్తూ పండగను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో చూసిన మెగా ఫ్యాన్స్ "మెగా ఫ్యామిలీ అంటేనే ఒక సెలబ్రేషన్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ బోగి వేడుకల్లో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశను వ్యక్తం చేస్తున్నారు.