Chiranjeevi: రికార్డుల వేటలో మెగాస్టార్.. రెండు రోజుల్లోనే రూ. 120 కోట్లు.. 'మన శంకరవరప్రసాద్ గారు' హవా.!

Chiranjeevi: రికార్డుల వేటలో మెగాస్టార్.. రెండు రోజుల్లోనే రూ. 120 కోట్లు.. 'మన శంకరవరప్రసాద్ గారు' హవా.!

మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన విశ్వరూపం చూపిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ చిత్రం రికార్డులు సృష్టిస్తోంది. కేవలం రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరి తన సత్తాను చాటుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. 

బాక్సాఫీస్ వద్ద మెగా ప్రభంజనం

ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. భారతదేశంలో కేవలం రెండు రోజుల్లోనే రూ. 61.1 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మొదటి రోజు రూ. 84 కోట్ల భారీ వసూళ్లతో అదరగొట్టిన ఈ చిత్రం, రెండో రోజు కూడా రూ. 40 కోట్ల గ్రాస్ సాధించి తన సత్తా చాటుకుంది. చిరంజీవి కెరీర్‌లో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఆరో చిత్రంగా ఇది నిలిచింది.

ALSO READ :  ‘అనగనగా ఒక రాజు’ రివ్యూ

ఓవర్సీస్‌లో రికార్డుల వేట

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, విదేశాల్లోనూ ఈ సినిమా మెగా హవా కొనసాగుతోంది. నార్త్ అమెరికాలో1.715 మిలియన్ల  డాలర్ల వసూళ్లతో రికార్డ్ సృష్టించింది. అటు యూకే లోనూ1,80,500  యూరోలకు పైగా వసూళ్లను రాబట్టింది. టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్ మై షో'లో గంటకు సగటున 24,000 టికెట్లు అమ్ముడవుతుండటం విశేషం. ఆంధ్ర ప్రాంతంలో మూడో రోజు కూడా దాదాపు 100 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు కళకళలాడుతున్నాయి.

ALSO READ : అనగనగా ఒక రాజు ఎంత నవ్విస్తుందో.. అంతే ఎమోషన్‌‌తో..

అనిల్ రావిపూడి మార్క్.. వెంకీ మామ మెరుపులు

కేవలం 25 రోజుల్లోనే స్క్రిప్ట్ పూర్తి చేసి, ఈ సినిమాను ఒక ఛాలెంజ్‌గా తీసుకుని పూర్తి చేశామని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. శంకరవరప్రసాద్‌గా చిరంజీవి నటన, ఆయన కామెడీ టైమింగ్ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తోంది. చిరంజీవి సరసన నయనతార తన నటనతో మెప్పించగా, విక్టరీ వెంకటేష్ అతిథి పాత్రలో మెరవడం సినిమాకు పెద్ద అసెట్ అయింది. భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం, సాహు గారపాటి , సుస్మిత కొణిదెల నిర్మాణ విలువలు సినిమాను ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి.

ALSO READ : ట్రేడింగ్ పేరుతో..డైరెక్టర్ తేజ కుమారుడికి ..

సక్సెస్ మీట్‌లో చిరంజీవి ధీమా

లేటెస్ట్ గా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. ఈ సినిమా లాంగ్ రన్‌లో రూ. 400 నుంచి 500 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నాం అని ధీమా వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. "అసలు సంక్రాంతి పండగ ఇప్పుడే మొదలైంది. కుటుంబ సమేతంగా చూడాల్సిన చిత్రమిది. నాకు ఇంతకంటే పెద్ద పండగ గిఫ్ట్ మరొకటి ఉండదు అని సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుత జోరు చూస్తుంటే, ఈ వీకెండ్ ముగిసేలోపు ఈ సినిమా సులభంగా రూ. 200 కోట్ల మార్కును దాటే అవకాశం ఉంది. మెగాస్టార్ బాక్సాఫీస్ స్టామినాకు ఈ చిత్రం మరో నిదర్శనంగా నిలుస్తోందంటున్నారు సినీ వర్గాలు..