సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజను ట్రేడింగ్ పేరుతో బోల్తా కొట్టించారు హైదరాబాద్ దంపతులు.లాభాలు వస్తాయని నమ్మించి రూ. 72 లక్షలు నిండా ముంచారు. అమితవ్ తేజ ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.
హైదరాబాద్ లో ఉంటున్న అమితవ్ తేజకు మోతీనగర్ కు చెందిన యార్లగడ్డ అనూష, కొండపనేని ప్రణీత్ దంపతులతో పరిచయం ఏర్పడింది. ట్రేడింగ్ లో పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించి పెట్టుబడి పెట్టేలా చేశారు. ఒక వేళ నష్టాలు వస్తే తాము ఉంటున్న అపార్ట్ మెంట్ ను రాసిస్తామని చెప్పారు. దీంతో వారి మాటలు నమ్మిన అమితవ్ తేజ విడతల వారీగా 72 లక్షలు వారికి అందజేశారు. నెలలు గడుస్తున్నా లాభాలు కానీ,అసలు కానీ ఇవ్వకపోవడంతో ఆయనకు అనుమానం వచ్చింది. దీంతో వారిని నిలదీయగా ముఖం చాటేశారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన అమితవ్ వెంటనే జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
