తేజేశ్వర్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహంచిన చిత్రం ‘మిషన్ సి 1000’. ప్రగ్యా నయన్ హీరోయిన్. కిరణ్మయి, విరాట్ శౌర్య నిర్మించారు. ఈ చిత్రాన్ని మార్చి 6న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. దేశభక్తి, శాస్త్ర విజ్ఞానం, హై వోల్టేజ్ యాక్షన్ కలయికతో ఈ చిత్రాన్ని రూపొందించినట్టు మేకర్స్ తెలియజేశారు.
భారతదేశ గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్న ఉగ్రవాద సంస్థ నుంచి దేశాన్ని కాపాడటమే ఇందులో హీరో మిషన్ అని చెప్పారు. కబీర్ సింగ్, జయ ప్రకాష్, సుధ, అనీష్ కురువిల్లా, కాళీ చరణ్ మహారాజ్ ఇతర పాత్రలు పోషించారు. శ్రీధర్ ఆత్రేయ సంగీతం అందించాడు.
