ఎర్రగట్టు వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

ఎర్రగట్టు వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం

హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా హసన్​పర్తి మండలం ఎర్రగట్టు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. వేదపండితులు పార్థసారథి ఆధ్వర్యంలో తెల్లవారుజామున నుంచే ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను రథంపై ప్రధాన వీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు డప్పు చప్పుళ్లు, కోలాటాలు, భక్తి పాటలు ఆలపించారు. భీమారం గ్రామం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మధ్యాహ్నం నుంచి చంద్రగ్రహణం ఉండడంతో ఆలయ తులుపులు మూసివేశారు. గ్రహణం ముగిసిన తర్వాత భక్తులు ఎడ్ల బండ్లు, మేకపోతుల బండ్ల రథాలు ఎర్రగట్టు దేవస్థానం చుట్టూ ఊరేగింపు చేపట్టారు. వేడుకల్లో ఉత్సవ కమిటీ సభ్యులు మార్క రాజు, తోట సురేశ్, చింతల రమేశ్, సదానందం, సుమన్ తదితరులు పాల్గొన్నారు.