మాస్కో: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్ అతలాకుతలం అవుతున్న వేళ.. భారత్ కు చమురు కష్టాలు రానీయబోమని రష్యా భరోసా ఇచ్చింది. గల్ఫ్ సంక్షోభం కారణంగా చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడినా, భారత్ కు అవసరమైన ఇంధన నిల్వలను సరఫరా చేసేందుకు తాము సిద్ధమని రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.
రష్యా నుంచి అందుతున్న ఈ దౌత్యపరమైన మద్దతుతో అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినా, భారత్ లో సరఫరాకు ఢోకా ఉండదని నిపుణులు భావిస్తున్నారు.
