- తప్పతాగి కారును నడిరోడ్డుపై ఆపిన సినీ డైరెక్టర్ కొడుకు
- కారు తీయాలన్నందుకు రెచ్చిపోయిన వైనం
- లా ఆండ్ ఆర్డర్పోలీసుల ఎంట్రీతో కారు లాక్ చేసుకొని అరగంటపాటు అందులోనే
జూబ్లీహిల్స్, వెలుగు: బంజారాహిల్స్లో సినీ దర్శకుడు మణిశంకర్ కొడుకు ప్రేమ్ శంకర్ మద్యంమత్తులో హల్చల్ సృష్టించాడు. మంగళవారం ఎస్ఎన్‌టీ జంక్షన్ వద్ద తన కారును నడిరోడ్డుపై నిలిపి ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తుండటంతో, అక్కడే విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్, హోంగార్డు మన్యం కారును పక్కకు తీయాలని కోరారు.
దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రేమ్ శంకర్.. ‘నన్నే ప్రశ్నిస్తారా?’ అంటూ హోంగార్డును కాలితో తన్ని, అసభ్య పదజాలంతో దూషించాడు. సమాచారం అందుకున్న లా అండ్ ఆర్డర్ పోలీసులు అక్కడికి చేరుకోగా, నిందితుడు సుమారు అరగంట పాటు కారు లాక్ చేసుకుని లోపలే ఉండిపోయి పోలీసులను ఇబ్బంది పెట్టాడు. చివరకు పోలీసులు అతడిని బయటకు లాగి స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు.
