ఆ ఇద్దరు BRS ఎమ్మెల్యేలే : స్పీకర్

ఆ ఇద్దరు BRS ఎమ్మెల్యేలే : స్పీకర్

పార్టీ మారినట్లు బీఆర్ఎస్ పార్టీ కంప్లయింట్స్ పై విచారణ చేసిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీర్పు వెల్లడించారు. విచారణ తర్వాత 2026, జనవరి 15వ తేదీన తన నిర్ణయాన్ని ప్రకటించారాయన. ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, పోచారం శ్రీనివాసరెడ్డిలు పార్టీ మారినట్లు తగిన ఆధారాలు లేవన్న స్పీకర్.. వాళ్లను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు స్పష్టం చేశారాయన. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాలు లేవన్నారాయన. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపునకు సంబంధించిన కేసులో ఈ తీర్పు వెల్లడించారు స్పీకర్. 

కొన్ని వారాల క్రితం.. ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి ఇలాంటి తీర్పునే ఇచ్చారు స్పీకర్. ఎమ్మెల్యేలు అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, కృష్ణమోహన్‌, ప్రకాష్‌గౌడ్‌, గూడెం మహిపాల్‌ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పష్టం చేశారు. దీంతో ప్రస్తుతం ఏడుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి క్లీన్ చిట్ వచ్చింది. మరో ముగ్గురు ఎమ్మెల్యేలకు సంబంధించి కేసు పెండింగ్ లో ఉంది. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి, సంజయ్ ఉన్నారు. వీరిపైనా త్వరలో విచారణ చేయనున్నారు స్పీకర్.

 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీ ఫామ్‎పై గెలిచిన 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారని, పార్టీ ఫిరాయించారనేది బీఆర్ఎస్ ప్రధాన ఆరోపణ. బీఆర్ఎస్ పిటీషన్లపై మొదట ఐదు మంది ఎమ్మెల్యేల అనర్హత పిటీషన్ తోసిపుచ్చిన స్పీకర్.. లేటెస్టుగా గురువారం (జనవరి 15) మరో ఇద్దరు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యపై ఉన్న పిటీషన్లను విచారించారు. పార్టీ మారినట్లు ఆధారాలు లేవని వారికి క్లీన్ ఇవ్వడంతో పాటు వారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే గుర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు.