ములుగు, వెలుగు : మేడారంలో జర్మన్ టెక్నాలజీతో టెంట్ సిటీ వెలిసింది. భక్తుల కోసం కాకుండా జాతరలో సేవలు అందించే వారితో పాటు వీఐపీలు, వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్‌ల కోసం ఈ టెంట్లను ఉపయోగించనున్నారు.
మేడారంలోని ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఎదురుగా ఎర్పాటు చేస్తున్న ఈ టెంట్ సిటీలో ఫైవ్ స్టార్ హోటల్స్‌లో ఉండే వసతులను కల్పిస్తున్నారు. మొత్తం 40 టెంట్లు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేయగా.. ఇప్పటివరకు 32 గుడారాలు నిర్మించగా.. మిగిలిన వాటిని మరో రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు రెవెన్యూ ఆఫీసర్లు వెల్లడించారు.
ఈ టెంట్ సిటీలో ఆరాం చైర్లు, బెడ్స్, ఫ్యాన్స్, టాయిలెట్ సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు సేవలు అందించే ఉన్నతాధికారుల కోసం జర్మన్ టెక్నాలజీతో అత్యాధునిక సౌకర్యాలతో టెంట్లను ఏర్పాటు చేయడం పట్ల ఆఫీసర్లు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
