వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2017లో జరిగిన మహిళ హత్య కేసులో నిందితులకు ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్వీపీ సూర్య చంద్రకళ తీర్పు చెప్పారు. కాటా రాణిని ఆమె భర్త కాటా మహేశ్, కాటా కన్త కలిసి హత్య చేయగా, మృతురాలి తల్లి కుకట్ల రాజమ్మ ఫిర్యాదు మేరకు పేరూరు ఎస్సై కృష్ణ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.
మృతురాలి భర్త కాటా మహేశ్, కాటా కన్తపై నేరం రుజువు కావడంతో ఏడేండ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయూర్తి తీర్పు చెప్పారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన పోలీస్ ఆఫీసర్లను ఎస్పీ
అభినందించారు.
