భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'పుష్ప' ఒక బ్రాండ్ మారిపోయింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మేకింగ్ కలిసి చేసిన ఈ ఫ్రాంజైజీ ప్రపంచ వ్యాప్తంగా రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద 'పుష్ప2' కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి పార్ట్ 3 పైనే ఉంది. లేటెస్ట్ సమాచారం ప్రకారం 'పుష్ప 3: ది రాంపేజ్' (Pushpa 3: The Rampage) పనులు అధికారికంగా ప్రారంభమైనట్లు తెలుస్తోంది
హైదరాబాద్‌లో ప్రత్యేక ఆఫీస్.. !
ఈ 'పుష్ప 3: ది రాంపేజ్' కోసం మేకర్స్ ఎక్కడా తగ్గడం లేదు. హైదరాబాద్‌లో ఈ సినిమా కోసమే ప్రత్యేకంగా ఒక ఆఫీస్‌ను లీజుకు తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడ స్క్రిప్ట్ డెవలప్‌మెంట్, స్టోరీ డిస్కషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పుష్పరాజ్ తన ఎర్రచందనం సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా దక్కించుకున్నాడు? తన శత్రువులను ఎలా ఎదురించాడు? అనే అంశాలను మరింత 'రాంపేజ్' గా చూపించబోతున్నారు.
షూటింగ్ ప్రారంభం ఎప్పటినుంచంటే?
అయితే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి మరింత కొంత సమయం పట్టనుంది. దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'పెద్ది'చిత్రం పనిలో బిజీ ఉన్నారు. ఈ మూవీ ఓపెనింగ్ చూస్తే .. ప్రేక్షకులు సీట్లలో వనికిపోతారని ఇటీవల దర్శకధీరుడు రాజమౌళి హింట్ ఇచ్చారు. ఇక అల్లు అర్జున్ కూడా ఫుల్ సినిమాలతో బిజీ ఉన్నారు. ప్రస్తుతం ఆయన అట్లీతో కలిసి భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నారు. ఈ చిత్రంలో బన్నీ సరసన దీపికా పదుకొనే నటిస్తోంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ వేగవంతంగా జరుగుతోంది.
ఫుల్ బిజీలో అల్లు అర్జున్..
అటు త్రివిక్రమ్ తో నాలుగో సినిమా కు రెడీ అవుతున్నారు అల్లు అర్జున్. 'అల వైకుంఠపురములో' తర్వాత వీరిద్దరి కాంబోలో మరో క్రేజీ ప్రాజెక్ట్ రానుంది. లోకేష్ కనగరాజ్ తో మల్టీస్టారర్ మూవీ సిద్ధమయ్యారు. ఈ ఏడాది భోగి సందర్భంగా (జనవరి 14, 2026) లోకేష్ కనగరాజ్ - అల్లు అర్జున్ కాంబో (AA23xLK7) అధికారికంగా ప్రకటించబడింది. దీనికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులన్నీ పూర్తయిన తర్వాతే 'పుష్ప 3' సెట్స్ పైకి వెళ్తుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఈ చిత్రం 2028 లో థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.తగ్గేదేలే అంటూ మొదలైన పుష్పరాజ్ ప్రయాణం.. 'రాంపేజ్' గా మారబోతోంది. అల్లు అర్జున్ పాన్ వరల్డ్ క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని సుకుమార్ ఈ కథను సిద్ధం చేస్తున్నారు.
