5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.2లక్షల 25వేలు వడ్డీ.. సూపర్ పోస్టాఫీస్ పెట్టుబడి ప్లాన్.. జీరో రిస్క్..

5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే రూ.2లక్షల 25వేలు వడ్డీ.. సూపర్ పోస్టాఫీస్ పెట్టుబడి ప్లాన్.. జీరో రిస్క్..

స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్ లాంటి రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్ కంటే.. పెట్టిన పెట్టుబడికి భద్రత ఉండాలని కోరుకునే వారు మన దేశంలో కోకొల్లలు. ప్రధానంగా మధ్యతరగతి ప్రజలు ఈ సూత్రానికే దశాబ్ధాలుగా కట్టుబడి ఉన్నారు. ఎందుకంటే కొసరు కంటే అసలు జాగ్రత్తగా ఉండాలని వారు నమ్ముతుంటారు. ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందుకున్న వారు, సీనియర్ సిటిజన్లు తమ సొమ్ము మార్కెట్ ఒడిదుడుకులకు లోనవ్వకుండా ఉండాలని భావిస్తారు. అలాంటి వారి కోసం భారత ప్రభుత్వం అందిస్తున్న అత్యుత్తమ పథకమే పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్. బ్యాంకుల్లో ఉండే ఫిక్స్‌డ్ డిపాజిట్ మాదిరిగానే పనిచేసే స్కీమ్.. ప్రస్తుతం అనేక ప్రైవేట్ ప్రభుత్వ బ్యాంకులతో పోలిస్తే మెరుగైన వడ్డీని అందిస్తోంది.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో అవసరాన్ని బట్టి 1, 2, 3 లేదా 5 ఏళ్ల కాలపరిమితితో డబ్బు డిపాజిట్ చేయవచ్చు. 2026 నాటి వడ్డీ రేట్ల ప్రకారం.. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లు ఈ విధంగా ఉన్నాయి...

* 1 ఏళ్ల కాలానికి: 6.9% వడ్డీ
* 2 ఏళ్ల కాలానికి: 7.0% వడ్డీ
* 3 ఏళ్ల కాలానికి: 7.1% వడ్డీ
* 5 ఏళ్ల కాలానికి: 7.5% వడ్డీ

ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. 5 ఏళ్ల టైమ్ డిపాజిట్‌ను ఎంచుకుంటే ఏకంగా 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. చాలా బ్యాంకులు 5 ఏళ్ల ఎఫ్‌డీలపై కూడా ఇంత అధిక వడ్డీని అందించడం లేదు.

రూ.5 లక్షల పెట్టుబడితో భారీ లాభం..
ఒక ఇన్వెస్టర్ తన దగ్గర ఉన్న రూ.5 లక్షల మొత్తాన్ని 5 ఏళ్ల పాటు ఈ పోస్టల్ స్కీమ్ లో ఉంచితే.. ఆ గడువు ముగిసేసరికి అతనికి లభించే మొత్తం రూ.7లక్షల 24వేల 975. అంటే కేవలం వడ్డీ రూపంలోనే మీరు రూ.2లక్షల 24వేల 975 అందుకుంటారు. మార్కెట్ ఒడిదుడుకులతో ఏమాత్రం సంబంధం లేకుండా.. స్థిరమైన, గ్యారెంటీడ్ ఆదాయం అందించటమే దీని అతిపెద్ద ప్లస్ పాయింట్.

పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ కేవలం వడ్డీ ఆదాయం మాత్రమే కాదు.. పన్ను ఆదాకు కూడా ఉపయోగపడుతుంది. 5 ఏళ్ల కాలపరిమితి గల టర్మ్ డిపాజిట్ ఎంచుకుంటే.. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80C కింద టాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. అలాగే అత్యవసర సమయాల్లో ఈ డిపాజిట్‌పై రుణం తీసుకునే ఫెసిలిటీ కూడా ఉంటుంది. రిస్క్ తీసుకోకుండా లక్షల రూపాయల ఆదాయం పొందాలని కోరుకునే లక్షల మంది మధ్యతరగతి భారతీయులకు ఇదొక బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు.