వరి కోసం శౌర్య ట్రాక్టర్లు.. రేటు రూ.5.7 లక్షల నుంచి మొదలు..

వరి కోసం శౌర్య ట్రాక్టర్లు.. రేటు రూ.5.7 లక్షల నుంచి మొదలు..

హైదరాబాద్, వెలుగు: దక్షిణాదిలో వరి సాగు కోసం ఎస్కార్ట్స్ కుబోటా పవర్ ట్రాక్ శౌర్య పేరుతో కొత్త సౌత్ స్పెషల్ వరి ట్రాక్టర్లను హైదరాబాద్లో మంగళవారం విడుదల చేసింది. 39 హెచ్‌‌పీ నుంచి 52 హెచ్‌‌పీ విభాగాల్లో ఐదు రకాలను అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని వరి సాగు అవసరాల కోసం ప్రత్యేకంగా వీటిని రూపొందించారు. మాగాణి పొలాల్లో బురద, నీరు లోపలికి వెళ్లకుండా క్యాసెట్ రకం సీలింగ్ రక్షణ కల్పించారు. కేవలం 3.1 మీటర్ల తక్కువ టర్నింగ్ రేడియస్ వల్ల చిన్న పొలాల్లో సులభంగా తిరుగుతాయి.

సాంకేతికంగా ఇందులో 8 ఫార్వర్డ్, 2 రివర్స్ గేర్లు, 2000 కిలోల బరువు ఎత్తగలిగే సెన్సి-1 హైడ్రాలిక్ లిఫ్ట్ ఉన్నాయి. డబుల్ క్లచ్, ఇండిపెండెంట్​ పీటీఓ ద్వారా బేలర్ వంటి ఆధునిక యంత్రాలను నడపవచ్చు. ఎత్తుగా ఉండే ప్లాట్‌‌ఫారమ్, అడ్జస్టబుల్ సీటు రైతులకు సౌకర్యవంతంగా ఉంటాయి.  ధరలు రూ.5.7 లక్షల నుంచి మొదలవుతాయని ఎస్కార్ట్స్ కుబోటా తెలిపింది.