నర్సంపేట పట్టణంలో పాడి పశువులకు అందాల పోటీలు

నర్సంపేట పట్టణంలో పాడి పశువులకు అందాల పోటీలు

నర్సంపేట, వెలుగు: నర్సంపేట పట్టణంలోని బాయ్స్​హైస్కూల్​లో శాంతిసేన సేవా రైతు సంఘం ఆధ్వర్యంలో బుధవారం డివిజన్​స్థాయి పాడిపశువుల అందాల పోటీలు నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన రైతులు తమ ఎడ్లు, పాడిగేదెలు, లేగదూడెలు, పొట్టేళ్లు, కోళ్లు, కుందేళ్లు, కుక్కలను ముస్తాబు చేసుకుని పోటీలకు తీసుకొచ్చారు. విజేతలకు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, మహబూబాబాద్​ ఎంపీ పోరిక బలరాంనాయక్​ షీల్డ్​లు, నగదు బహుమతులను అందజేశారు. 

కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్లు పెండెం రామానంద్, సొంటిరెడ్డి రంజిత్​రెడ్డి, శాంతిసేన రైతు సేవా సంఘం అధ్యక్షుడు చిలువేరు కుమారస్వామి, గౌరవాధ్యక్షుడు ఎర్ర జగన్మోహన్​రెడ్డి, చిలువేరు కుమారస్వామి, మెండు అశోక్, చిలువేరు కొమ్మాలు, బుర్ర మోహన్​రెడ్డి, తోట అశోక్, చింతల సాంబరెడ్డి, రేమిడి శ్రీనివాస్​రెడ్డి, ఈగ సత్యనారాయణ, ఒరగంటి ప్రభాకర్, యాకూబ్​రెడ్డి తదితరులున్నారు. పాడి పశువుల అందాల పోటీలను తిలకించేందుకు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం నర్సంపేట టౌన్​లో ఎంపీ, ఎమ్మెల్యే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.