కాల్వలు రిపేర్లు చేయండి : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

కాల్వలు రిపేర్లు చేయండి : ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదాద్రి, వెలుగు :  కాల్వలకు రిపేర్లు చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య సూచించారు. ఆలేరు మండలం శారాజీపేట, గొలనుకొండలోని కాల్వలను ఆయన పరిశీలించారు. కాల్వల్లో పలుచోట్ల మొక్కలు, గడ్డి పెరిగి ఉండడంతో పాటు అక్కడక్కడ లైనింగ్​ దెబ్బతిని ఉండడాన్ని గమనించారు.

వెంటనే వాటిని రిపేర్లు చేయించాలని ఆఫీసర్లను ఆదేశించారు. ప్రభుత్వం వ్యవసాయాన్ని బలోపేతం చేయడంతో పాటు రైతులకు అన్ని విధాలా అండగా నిలబడి వారి సంక్షేమం కోసం పాటుపడుతోందని తెలిపారు. .