బెంగళూరు: మిడిల్ ఈస్ట్ దేశాల్లో యుద్ధం కారణంగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన ఇండియా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సేఫ్‌గా ఇండియాకు తిరిగొచ్చింది. మంగళవారం బెంగళూరు చేరుకున్నట్టు తెలిపింది. బర్మింగ్‌హామ్ వెళ్లే క్రమంలో దుబాయ్‌లో కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఆగిన సింధు అక్కడ విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆల్ ఇంగ్లండ్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
గత కొన్ని రోజులు ఎంతో ఆందోళనగా గడిచాయని, క్షేమంగా ఇల్లు చేరడం సంతోషంగా ఉందని సింధు పేర్కొంది. ఆల్ ఇంగ్లండ్ టోర్నీకి దూరమవ్వడం తీరని లోటని, ప్రస్తుతానికి రెస్ట్ తీసుకుని తదుపరి టోర్నమెంట్ గురించి ఆలోచిస్తానని చెప్పింది.
