పాలక్ పనీర్ వివాదం.. అమెరికాలో రూ.1.8 కోట్లు గెలిచిన భారత విద్యార్థులు

పాలక్ పనీర్ వివాదం.. అమెరికాలో రూ.1.8 కోట్లు గెలిచిన  భారత విద్యార్థులు

ఏదేశమేగినా.. ఎందుకాలిడినా.. పొగడరా నీ తల్లి భూమి భారతిని.. అనే గీతాన్ని బాగా ఒంటబట్టించుకున్నారేమో ఈ భారత పరిశోధక విద్యార్థులు. విదేశీ గడ్డపై భారతీయ ఆహార అలవాట్లపై చూపిస్తున్న వివక్షను ఎదుర్కొని విజయం సాధించారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడి ఏకంగా కోటి 80 లక్షల రూపాయల పరిహారాన్ని గెలిచారు. 

వివరాల్లోకి వెళ్తే.. ఆదిత్య ప్రకాశ్, ఊర్మి భట్టాచార్య అనే ఇద్దరు పీ.హెచ్డీ విద్యార్థులు.. మా ఆహారం మాకు గౌరవం అంటూ పోరాడారు. కొలరాడో యూనివర్సిటీలో పాలక్ పనీర్ విషయంలో జరిగిన అవమానానికి వ్యతిరేకంగా నిలబడి.. పౌరహక్కుల దావాలో నెగ్గి 2 లక్షల యూఎస్ డాలర్ల (రూ.1.8 కోట్లు) పరిహారాని పొందారు.

ALSO READ : ఏది దొరికితే అది పట్టుకుని ఇరాన్ విడిచి వెళ్లండి

2023 సెప్టెంబర్ లో పాలక్ పనీర్ అంశంలో డిపార్టుమెంట్ లో వివాదం జరిగింది. పాలక్ పనీర్ మైక్రోవేవ్ లో వేడి చేయవద్దని.. అది దుర్వాసన వస్తుందంటూ డిపార్టుమెంట్ స్టాఫ్ హేళన చేశారు. ప్రకాశ్ లంచ్ ఘాటైన వాసన వస్తుందని కంప్లైంట్ చేశారు. ఇది జస్ట్ ఫుడ్.. హీట్ చేసుకుని వెళ్లిపోతున్న. తినే ఆహారమే కదా అని బదులిచ్చాడు. దీంతో డిపార్ట్మెంట్ లో ఫుడ్ విషయంలో వివక్ష చూపడం, అవమానించడం జరిగిందని కోర్టుకెక్కారు ప్రకాశ్, ఊర్మి భట్టాచార్య. 

కొలరాడో యూఎస్ డిస్ట్రిక్ కోర్టులో పౌరహక్కుల దావా వేశారు. యూనివర్సిటీలో వివక్ష పూరిత వాతావరణం ఉన్నట్లు దావాలో పేర్కొన్నారు. దక్షిణ ఆసియా స్టూడెంట్స్ పై వివక్ష చూపేలా డిపార్ట్మెంట్ కిచెన్ నిబంధనలు ఉన్నాయని.. కామన్ ఏరియాలో లంచ్ బాక్స్ లను ఓపెన్ చేయడంపై అవమానం జరుగినట్లు కోర్టుకు తెలిపారు. 

ALSO READ : మా అమ్మాయి చదువుకుంటారు..

డిపార్ట్మెంట్ మీటింగ్ లలో తనను అవమానించారని ప్రకాశ్ పేర్కొనగా.. ఎలాంటి ఎక్స్ ప్లేనేషన్ లేకుండా తనను టీచింగ్ అసిస్టెంట్ పొజిషన్ నుంచి తొలగించినట్లు ఊర్మీ భట్టాచార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. పాలక్ పనీర్ ఇన్సిడెంట్ తర్వాత రెండు రోజులు తమను రెచ్చగొడుతూ గొడవలకు దిగినట్లు పేర్కొన్నారు. 

ఈ వివాదంపై రెండేళ్ల వాదన తర్వాత.. కోర్టు ఆదేశాల మేరకు రూ.1.8 కోట్ల పరిహారం ఇచ్చేందుకు  2025 సెప్టెంబర్ లోయూనివర్సిటీ అంగీకరించింది. అతేకాకుండా వారికి మాస్టర్స్ డిగ్రీ ఇచ్చింది. అయితే భవిష్యత్తులో యూనివర్సిటీలో చేరేందుకు అవకాశం లేకుండా నిషేధం విధించడంతో 2026 జనవరిలో ఈ జంట ఇండియాకు చేరుకున్నారు. 

ALSO READ : పోలీస్ కారును బాంబులతో పేల్చేశారు

ఈ ఏడాది నేనొక పెద్ద యుద్ధమే చేశాను. తినే ఆహారం విషయంలో స్వేచ్ఛకోసం.. నా కలర్, నా రూపం, నా భాష, యాస ఏదైనా.. వివక్షకు వ్యతిరేకంగా పోరాడి గెలిచాం.. అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశాడు ప్రకాశ్. అదే క్రమంలో. నా ఆత్మగౌరవం, నా విశ్వాసానికి దెబ్బతీసే ఏ అంశానికి వ్యతిరేకంగా పోరాడి గెలిచాను. అణచివేత, వివక్షలను సహించేది లేదు. ఈ విషయంలో నా వాయిస్ స్థిరంగా ఉంటుందంటూ ఊర్మీ పోస్ట్ చేశారు.