మా అమ్మాయి చదువుకుంటారు.. నార్త్ అమ్మాయిలు బానిసలు : మారన్ మాటల మంటలు

మా అమ్మాయి చదువుకుంటారు.. నార్త్ అమ్మాయిలు బానిసలు : మారన్ మాటల మంటలు

చెన్నై: దక్షిణాది అమ్మాయిలు చాలా చక్కగా చదువుకుంటారు.. అబ్బాయిలతో సమానంతో ఇంగ్లీష్ చదువుతారు.. ఉద్యోగాలు చేస్తారు.. నార్త్ ఇండియా అమ్మాయిలు అలా కాదు.. వాళ్లు హిందీ మాత్రమే మాట్లాడాలి అంటారు.. అబ్బాయిలతో సమానంగా చదువుకోరు.. నార్త్ అమ్మాయిలు బానిసలుగా ఉంటారు.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. తమిళనాడు రాష్ట్రం డీఎంకే పార్టీ కీలక నేత, ఎంపీ దయానిధి మారన్. నార్త్ ఇండియాలో సంకుచిత భావం వల్లే.. అక్కడ అమ్మాయిలు బానిసలుగా.. నిరుద్యోగులు ఉన్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు.. నార్త్ ఇండియా బీజేపీ నేతలకు రుచించటం లేదు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ALSO READ : కర్ణాటక సీఎం ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్..

ఉత్తరాది మహిళలపై డీఎంకే ఎంపీ దయానిధి మారన్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సౌత్, నార్త్ మహిళల జీవన శైలీ, చదువు వంటి అంశాల మధ్య వ్యత్యాసం గురించి మాట్లాడారు. దక్షిణాదిలో అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా చదువుకుని ఉద్యోగాలు చేస్తుంటే.. ఉత్తరాదిలో మాత్రం మహిళలు వంటింటి పనులు, పిల్లల్ని కనడానికి మాత్రమే పరిమితం అవుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. 

ALSO READ : పొట్ట కూటికోసం ఫుడ్ డెలివరీ..

ముఖ్యంగా తమిళనాడు ద్రవిడ నమూనా అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ సమాన విద్యను ప్రోత్సహిస్తోందని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో ఇంగ్లీష్ చదవద్దని.. హిందీ మాత్రమే చదవాలని చెబుతున్నారని పరోక్షంగా బీజేపీని విమర్శించారు. నార్త్ స్టేట్స్‎లో విద్యార్థులను హిందీ మాత్రమే చదవమని ప్రోత్సహిస్తున్నారని.. ఇంగ్లీష్ చదివితే నాశమైపోతారని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి దక్షిణాదికి ప్రజలు తరలి రావడానికి ఈ విద్యా పద్ధతులే కారణమని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి కంపెనీలన్నీ తమిళనాడుకు వస్తున్నాయంటే దానికి కారణం రాష్ట్రంలో విద్యావంతులైన వ్యక్తులు ఉండటమేనన్నారు.

ALSO READ : అవినీతి నిరోధక శాఖ చట్టంలోని సెక్షన్ 17ఏపై సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయం

 విద్యను హిందీకి మాత్రమే పరిమితం చేయడం వల్ల ఇతర ప్రాంతాలలో నిరుద్యోగం పెరుగుతుందని అన్నారు. తమిళనాడులోని ద్రవిడ నమూనా బాలికలు,  బాలురు ఇద్దరికీ సమాన విద్యను ప్రోత్సహిస్తుందని.. తద్వారా రాష్ట్రంలో అక్షరాస్యత పెరిగిందని చెప్పారు. ఆంగ్ల విద్యను నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థుల ఉద్యోగ అవకాశాలు, పరిమితం అవుతాయని పేర్కొన్నారు. ఎంపీ దయానిధి మారన్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనకు కనీసం ఇంగితజ్ఞానం లేదని విమర్శించింది. దేశానికి, ముఖ్యంగా హిందీ మాట్లాడే వర్గాలకు ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. దయానిధి మారన్ వ్యాఖ్యలతో మరోసారి హిందీ వివాదం చెలరేగింది.