కర్ణాటక సీఎం ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్.. రాహుల్ గాంధీతో మీటింగ్ కి సిద్దరామయ్య ప్లాన్..

కర్ణాటక సీఎం ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్.. రాహుల్ గాంధీతో మీటింగ్ కి సిద్దరామయ్య ప్లాన్..

కర్ణాటక పవర్ షేరింగ్ వివాదంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం మార్పు లేదంటూ వార్తలు వచ్చిన క్రమంలో మరోసారి కర్ణాటకలో పొలిటికల్ హీట్ పెరిగింది. సీఎం సిద్దరామయ్య రాహుల్ గాంధీతో భేటీ అయ్యేందుకు సన్నాహాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. సీఎం మార్పు అంశంలో నెలకొన్న గందరగోళానికి తెర దించేందుకు ప్రయత్నం చేస్తున్నారు సిద్దరామయ్య. రాహుల్ గాంధీతో సమావేశం కోసం సీఎం సిద్దరామయ్య రిక్వెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా సిద్ధరామయ్య తన మంత్రివర్గ విస్తరణకు ప్లాన్ చేస్తున్నారని.. అందులో  భాగంగానే రాహుల్‌ గాంధీతో భేటీ అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది . ఈ క్రమంలో ఒకవేళ కేబినెట్‌ విస్తరణ జరిగితే.. డీకే శివకుమార్‌ సహా ఆయన మద్దతుదారులకు బెర్త్ ఉంటుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

కర్ణాటకలో సీఎం మార్పు లేదని కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. అంతర్గత సమస్యలు రాష్ట్ర నాయకత్వమే పరిష్కరించుకోవాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇప్పటికే స్పష్టం చేశారు. గతంలో సీఎం మార్పు అంశాన్ని అటు సిద్దరామయ్య, ఇటు డీకే శివకుమార్ లు ఇద్దరు ఖండించారు. పార్టీ నాయకత్వంపై తనకు విశ్వాసం ఉందని.. పదవీకాలం ఉన్నంతవరకు తానే సీఎంగా ఉంటానని అన్నారు సిద్దరామయ్య.