- నిర్ణయించిన కేంద్రం
హైదరాబాద్, వెలుగు: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజనతోపాటు ఇతర సంక్షేమ పథకాలకు అందించే ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరాను తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులకు పోషకాలు మరింత సమర్థవంతంగా అందించే ప్రత్యామ్నాయ విధానాన్ని గుర్తించేవరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ఆహార, పౌర సరఫరాల శాఖ తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం తయారీలో ఉన్న ఫోర్టిఫైడ్ రైస్ కర్నెల్స్ వివరాలను మార్చి 30 లోపు ఫర్ ట్రేస్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని, ఆ తర్వాత కొత్త బ్యాచ్‌లను అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఇకపై కొత్త ఎఫ్ఆర్ కే తయారీదారుల ఎంపానెల్‌మెంట్ నిలిపివేయాలని, 2025–26 రబీ పంట నుంచి కేవలం నాన్ -ఫోర్టిఫైడ్ బియ్యాన్ని మాత్రమే కొనుగోలు చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. ప్రస్తుతమున్న ఫోర్టిఫైడ్ బియ్యం నిల్వలు పూర్తయ్యే వరకు పథకాల కింద పంపిణీ కొనసాగించనుంది.
