పోలీస్ కారును బాంబులతో పేల్చేశారు : పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపు వీడియో రిలీజ్

పోలీస్ కారును బాంబులతో పేల్చేశారు : పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపు వీడియో రిలీజ్

పాకిస్తాన్ దేశంలో ఘోరం జరిగింది. రెండు రోజుల టెర్రరిస్టులు వీడియో రిలీజ్ చేసే వరకు ఈ విషయం ప్రపంచానికి తెలియకపోవటం ఘోరం. పాకిస్తాన్ దేశంలో పోలీసులను టార్గెట్ చేసిన ఓ టెర్రరిస్ట్ గ్రూప్.. పోలీసులతో వెళుతున్న జీపును IED అనే పేలుడు పదార్థంతో పేల్చేశారు. పేలుడు ధాటికి జీపు గాల్లోకి ఎగిరి.. పీస్ పీస్ అయ్యింది. చాలా  మంది పోలీసులు చనిపోయారు. ఈ ఘోరాన్ని వీడియో తీసిన ఈ టెర్రరిస్ట్ గ్రూపు.. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్‌లో టెర్రర్ గ్రూప్ తెహ్రీక్-ఏ-తాలిబాన్ పాకిస్థాన్(TTP) జరిపిన భీభత్సం యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ట్యాంక్ జిల్లాలో సోమవారం పోలీస్ వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఐఈడీ పేలుడుకు సంబంధించిన భయంకరమైన వీడియో బయటకు వచ్చింది. పోలీసుల వాహనాన్ని టార్గెట్ చేసి దానిని దూరం నుంచి రికార్డ్ చేసినట్లు వీడియో చూస్తే అర్థం అవుతుంది. 

ALSO READ : 6 నెలల్లో TCS నుంచి 30వేల మంది టెక్కీలు ఔట్..

పోలీసు వాహనం వెళ్తుండగా ఒక్కసారిగా శక్తివంతమైన పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. పేలుడు తీవ్రత ఎంతలా ఉందంటే.. వాహన భాగాలు గాల్లోకి ఎగిరి దూరంగా పడిపోయాయి. రోడ్డుపై ఒక భారీ గొయ్యి ఏర్పడగా.. ధ్వంసమైన పోలీస్ వాహనం రోడ్డుకు కొన్ని మీటర్ల దూరంలో చెల్లాచెదురుగా పడిపోయింది.

ALSO READ : కర్ణాటక సీఎం ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్..

వీడియోలో కనిపించిన మరికొన్ని దృశ్యాల్లో పేలుడులో తీవ్రంగా గాయపడి, ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న పోలీసులపై ఉగ్రవాదులు కాల్పులు జరపటం వారి క్రూరత్వా్న్ని నిరూపిస్తోంది. బ్లాస్ట్ తర్వాత మరణించిన పోలీసుల వద్ద ఉన్న ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని దోచుకుని ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఒక సబ్-ఇన్‌స్పెక్టర్, ముగ్గురు ఎలైట్ ఫోర్స్ సిబ్బంది, వాహనం నడుపుతున్న డ్రైవర్‌తో సహా మొత్తం ఏడుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. 

ALSO READ : ఖమేనీకి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. 

ఈ దారుణ ఘటనను పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. దేశ శాంతి భద్రతల కోసం ప్రాణాలర్పించిన పోలీసుల త్యాగం వెలకట్టలేనిదని కొనియాడారు. పాక్ సరిహద్దు ప్రాంతాల్లో పెరుగుతున్న ఉగ్రవాద కార్యకలాపాలు ఇప్పుడు అక్కడి భద్రతా దళాలకు పెద్ద సవాలుగా మారాయి. దీనికి ముందు కూడా పాక్ ఆర్మీ, పోలీసులను లక్ష్యంగా చేసుకుని కొన్ని ఉగ్రవాద సంస్థలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. పాక్ పాలు పోసి పెంచిన ఉగ్రవాదం ఇప్పుడు దానికే నిద్రలేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.