ఖమేనీకి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఎర్ఫాన్ సోల్తానీని ఉరితీస్తే అంతుచూస్తానంటూ హెచ్చరిక..

ఖమేనీకి ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..  ఎర్ఫాన్ సోల్తానీని ఉరితీస్తే అంతుచూస్తానంటూ హెచ్చరిక..

ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ గొడవల్లో దాదాపు 2వేల మంది వరకు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే వీరికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి ఫుల్ సపోర్ట్ దొరుకుతోంది. ఖమేనీ పతనానికి అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. వాటిని అదే స్థాయిలో ఇరాన్ తొక్కిపెడుతోంది. దీంతో బాహాటంగానే తన సపోర్ట్ ప్రకటిస్తున్నారు అధ్యక్షుడు ట్రంప్. మీరు సపోర్ట్ దొరుకుతుంది అంటూ తాజా కామెంట్స్ తర్వాత మరో సారి కీలక హెచ్చరిక చేశారు ప్రెసిడెంట్.

ALSO READ : ఇరాన్‌‌‌‌- ఘర్షణలకు ఆజ్యం పోస్తున్న ట్రంప్‌‌‌‌!

ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా సామాన్యులు చేస్తున్న ఆందోళనలు ఇప్పుడు ప్రపంచవ్యాప్త రచ్చరచ్చ అవుతోంది. ముఖ్యంగా 26 ఏళ్ల నిరసనకారుడు ఎర్ఫాన్ సోల్తానీకి జనవరి 14న ఉరిశిక్ష అమలు చేయాలన్న అయతొల్లా అలీ ఖమేనీ ప్రభుత్వ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ ప్రభుత్వం మానవత్వాన్ని ప్రదర్శించాలని, నిరసనకారుల ప్రాణాలు తీయడం ఆపాలని ట్రంప్ హెచ్చరించారు. నిరసనకారులకు  సహాయం అందుతుందంటూ కామెంట్ చేశారు. 

ALSO READ : వెనక్కి తగ్గకండి.. భారీ సహయం అందబోతుంది

ఒకవేళ టెహ్రాన్ ప్రభుత్వం నిరసనకారులను ఉరితీయడం మొదలుపెడితే.. అమెరికా అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటుందని ట్రంప్ హెచ్చరించారు. ఇప్పటికే ఇరాన్ అధికారులతో జరపాల్సిన చర్చలను ట్రంప్ రద్దు చేసుకున్నారు. అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఖతార్‌లోని అమెరికా వైమానిక స్థావరంలో బి-2 బాంబర్లు, యుద్ధ విమానాలు సిద్ధంగా ఉండటం యుద్ధ మేఘాలను సూచిస్తోంది.

టెహ్రాన్ శివారులోని కరాజ్ నివాసి అయిన ఎర్ఫాన్ సోల్తానీని జనవరి 8న ప్రభుత్వం అరెస్టు చేసింది. కనీస మానవ హక్కులు కూడా లేకుండా నిర్బంధించి, నిరసనలు అణచివేయడానికి అతడికి ఉరిశిక్ష విధించింది. 2025 డిసెంబర్ చివరి వారంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల మొదలైన ఈ ఉద్యమంలో ఇప్పటివరకు 16వేల 700 మందికి పైగా అరెస్టయ్యారు. 

ALSO READ : 26 ఏళ్ల ప్రజా ఉద్యమకారుడిని ఉరి తీయబోతున్న ఇరాన్ ఖమేనీ సర్కార్.. !

మరోపక్క అమెరికా హెచ్చరికలపై ఇరాన్ కూడా అంతే ఘాటుగా స్పందించింది. సీనియర్ అధికారి అలీ లారిజానీ మాట్లాడుతూ.. ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇద్దరూ ఇరాన్ ప్రజలకు హంతకులని ఆరోపించారు. ఇరాన్‌లోని 31 ప్రావిన్సుల్లో 600కు పైగా నిరసనలు జరుగుతుండటంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఒక సామాన్య యువకుడి ఉరిశిక్ష రెండు దేశాల మధ్య యుద్ధానికి దారితీస్తుందా అనే ఉత్కంఠ ప్రస్తుతం నెలకొంది. అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం చూస్తుంటే ఎవ్వరూ తగ్గేలా కనిపించటం లేదని నిపుణులు అంటున్నారు.