- 352 మంది తాలిబాన్లను హతమార్చాం: పాక్
- వారికి మద్దతుగా నిలిచిన టెర్రరిస్టులనూ మట్టుబెట్టినం
- పాక్ కావాలా లేక టెర్రరిస్టులా తేల్చుకొమ్మని అఫ్గాన్‌కు హెచ్చరిక
కాబుల్: పాకిస్తాన్‌కు చెందిన ఓ యుద్ధ విమానాన్ని కూల్చివేసినట్లు అఫ్గాన్ దళాలు శనివారం వెల్లడించాయి. తమ దేశంలోని జలాలాబాద్‌లో పాకిస్తాన్ ఫైటర్ జెట్‌ను కూల్చివేశామని.. పారాచూట్ సాయంతో కిందకు దూకే ప్రయత్నం చేసిన పైలట్ను బంధించామని తెలిపాయి. ఈ విషయాన్ని అఫ్గానిస్తాన్ తూర్పు సైనిక ప్రతినిధి వహిదుల్లా మహమ్మదీ కన్ఫామ్ చేశారు.
అయితే, అఫ్గాన్ వ్యాఖ్యలను పాకిస్తాన్ ఖండించింది. తమ ఫైటర్ జెట్‌ను అఫ్గాన్ కూల్చివేయడం, పైలట్‌ను బంధించడమనేది పూర్తిగా అబద్ధమని పేర్కొంది. పాకిస్తాన్ గతంలో చేసిన దాడులకు ప్రతీకారంగా ఆ దేశంపై అఫ్గాన్ దళాలు గురువారం రాత్రి నుంచి దాడులను ప్రారంభించాయి.
దీనికి ప్రతిగా తాము ఇప్పటిదాకా చేసిన వైమానిక దాడుల్లో 270 మందికి పైగా తాలిబన్లు మరణించారని, 400 మందికి పైగా గాయపడ్డారని పాకిస్తాన్ ప్రకటించింది. అలాగే, తాము 55 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చామని తాలిబాన్లు పేర్కొన్నారు.
దుబాయ్ ఎయిర్ పోర్టు షట్ డౌన్
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడింది. శనివారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇతర గల్ఫ్ ప్రాంతాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేయడంతో, దుబాయ్ ఇంటర్నేషనల్ (డీఎక్స్ బీ), దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డీడబ్ల్యూసీ) విమానాశ్రయాల్లో రాకపోకలను నిరవధికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఎయిర్ పోర్టు మూసివేతతో ప్రపంచ విమానయాన రంగంపైనే తీవ్ర ప్రభావం పడనుంది.
