V6 News

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు: ట్రంప్ ప్రకటన

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడు: ట్రంప్ ప్రకటన

వాషింగ్టన్: ఇరాన్‎పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‎ఫామ్ సోషల్ ట్రూత్‎లో సంచలన ప్రకటన చేశారు.

‘‘చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకరైన ఖమేనీ చనిపోయాడు. మా ఇంటెలిజెన్స్, అత్యంత అధునాతన ట్రాకింగ్ వ్యవస్థలను అతడు తప్పించుకోలేకపోయాడు. ఈ చావుతో ఇరాన్, అమెరికా, బాధిత దేశాలకు న్యాయం జరిగింది. ఖమేనీతో పాటు ఇతర ఇరాన్ అగ్ర నాయకులు కూడా హతమయ్యారు. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం’’ అని ట్రంప్ పేర్కొన్నారు.

ఇరాన్ రివల్యూషనరీ గార్డ్, భద్రతా దళాలు యుద్ధం చేయడానికి ఆసక్తి చూపడం లేదన్నారు. ఖమేనీ, ఇరాన్ అగ్ర నాయకులు హతమైనప్పటికీ మరో వారం రోజులు దాడులు కొనసాగుతాయని ట్రంప్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ కూడా ఖమేనీ మరణవార్తను ధృవీకరించింది.

 అయితే.. ఖమేనీ మరణాన్ని ఇప్పటి వరకు ఇరాన్ ధృవీకరించలేదు. అదే సమయంలో ఆయన ప్రాణాలతో ఉన్నారని కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు.. ఖమేనీ చనిపోయారే వార్తలతో ఇరాన్ పౌరులు రోడ్లపైకి వచ్చి  సంబరాలు చేసుకుంటున్నారు.