తెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసాలపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసింది. బాంబుల వర్షం కురిపించి ఖమేనీ ఇంటిని నేలమట్టం చేసింది. తెహ్రాన్లోని ఖమేనీ ఇంటి కాంపౌండ్ తునాతునకలైంది. ఖమేని ఇల్లు ధ్వంసానికి సంబంధించి న్యూయార్క్ టైమ్స్ ఒక శాటిలైట్ ఇమేజ్ విడుదల చేసింది. ఇరాన్ ప్రెసిడెంట్ పిజిష్కియెన్ నివాసాలపై కూడా దాడులు ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేసింది. ఇజ్రాయిల్, అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ దాడులు కూడా ప్రతి దాడులకు దిగింది.
దుబాయ్‌పై ఇరాన్ బాంబుల వర్షం కురిపిస్తుండటంతో.. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడుల్లో ఇరాన్లోని గర్ల్స్ ఎలిమెంటరీ స్కూల్ ధ్వంసమైంది. 40 మంది విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. 50 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలను కూడా ఇరాన్ టార్గెట్ చేసింది. సౌదీ అరేబియా, అబుదాబితో సహా 8 దేశాలపై ఇరాన్ మిస్సైల్స్తో అటాక్ చేస్తుండటంతో యూఏఈ, బెహ్రెయిన్, ఖతార్, జోర్డాన్, కువైట్ దేశాలు భయంతో వణికిపోతున్నాయి.
బెహ్రయిన్లోని అమెరికా మిలటరీ బేస్పై ఇరాన్ బాంబు దాడులు చేసింది. ఈ దాడి దృశ్యాలు ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఖతార్ రాజధాని దోహాలో కూడా రెండు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించినట్లు ఖతార్ రక్షణ శాఖ ధృవీకరించింది. ఇదిలా ఉండగా.. బెహ్రెయిన్, ఖతార్, జోర్డాన్, కువైట్ దేశాలపై ఇరాన్ అటాక్స్ను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది.
దేశ సార్వభౌమాధికారం, అంతర్జాతీయ చట్ట సూత్రాల ఉల్లంఘన ఇలానే కొనసాగితే ఇరాన్ తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సౌదీ అరేబియా హెచ్చరించింది. దుబాయ్‌లో కూడా పేలుళ్లు సంభవించాయి. సౌదీ అరేబియాలోని రియాద్పై కూడా ఇరాన్ బాంబు దాడులు చేసింది.
