మేడారం వన దేవతలకు పండుగ మొక్కులు

మేడారం వన దేవతలకు పండుగ మొక్కులు

సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బుధవారం తెల్లవారుజాము నుంచే భక్తులు జంపన్న వాగులో స్నానాలు చేసి, నాగులమ్మ, జంపన్న గద్దెల వద్ద ముడుపులు కట్టారు. కల్యాణకట్టవద్ద తలనీలాలు సమర్పించారు. 

ఎత్తుబెల్లంతో గద్దెల వద్దకు చేరుకుని అమ్మవార్లకు పసుపు, కుంకుమ, పూలు, చీర సారెను సమర్పించారు. అనంతరం వనంలో వంటా వార్పు చేసుకున్నారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మూడు లక్షల మంది భక్తులు మేడారం వనదేవతలను దర్శనం చేసుకున్నట్లు ఎండోమెంట్ ఈవో మేకల వీరస్వామి తెలిపారు.- తాడ్వాయి, వెలుగు