సూర్య 46 మూవీపై క్రేజీ అప్‌డేట్.. భారీ ధరకు ఓటిటి హక్కులు కైవసం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

సూర్య 46 మూవీపై క్రేజీ అప్‌డేట్.. భారీ ధరకు ఓటిటి హక్కులు కైవసం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. ‘కంగువ’ వంటి భారీ పీరియడ్ యాక్షన్ డ్రామా తర్వాత.. రూట్ మార్చిన ఆయన  ఒక క్లాస్ అండ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాను ఎంచుకున్నారు. ‘సార్’ (Vaathi), ‘లక్కీ భాస్కర్’ వంటి వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య తన 46వ చిత్రాన్ని (Suriya 46) చేస్తున్నారు. లేటెస్ట్ గాఈ సినిమాకు సంబంధించిన ఓటిటి డీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

భారీ ధరకు నెట్‌ఫ్లిక్స్ కైవసం

ఈ సినిమాను ఒక స్పోర్ట్స్ ఛాంపియన్ తన వృత్తిని, కుటుంబ జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తాడనే పాయింట్‌తో  తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ తెగ ఆకట్టకుంటోంది. ఇది ఒక పరిపూర్ణమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన స్పోర్ట్స్ డ్రామా అని స్పష్టమవుతోంది. అయితే ఈ చిత్రం థియేటర్లలో విడుదలైన తర్వాత ప్రముఖ ఓటిటి సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. కేవలం తమిళం మాత్రమే కాకుండా తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. సూర్య మార్కెట్, వెంకీ అట్లూరి క్రేజ్ దృష్ట్యా ఈ డీల్ టాలీవుడ్, కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

తారాగణం 

 ‘ప్రేమలు’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన మమితా బైజు ఈ చిత్రంలో సూర్య సరసన నటిస్తోంది.  సీనియర్ నటీమణులు రవీనా టాండన్ , రాధిక శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.  సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ , శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌లపై నాగవంశీ, సాయి సౌజన్య అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు  . ఈ సినిమా షూటింగ్ 2025 డిసెంబర్ నాటికే పూర్తయింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు ఐరోపాలోని అందమైన ప్రదేశాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

సూర్యలోని నటుడిని, వెంకీ అట్లూరిలోని సున్నితమైన భావోద్వేగాలను కలిపి చూపిస్తున్న ఈ చిత్రం 2026 వేసవి కానుకగా థియేటర్లలోకి రానుంది. ఒక స్పోర్ట్స్ మ్యాన్ వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణను ఈ సినిమా ఎలా ఆవిష్కరిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.