చైనా మాంజా ప్రజల పాలిట యమపాశంగా మారుతోంది. ఎక్కడ పడితే అక్కడ గొంతులు కట్ చేస్తూ ప్రాణాలు తీసేస్తోంది. ముఖ్యంగా బైక్ పై వెళ్తున్న వారి గొంతులు, చేతులు, ఇతర శరీర భాగాలను కోసేస్తూ కత్తికంటే పదునైన ఆయుధంగా భయపెడుతోంది. భోగీ రోజైన జనవరి 14వ తేదీన సంగారెడ్డి జిల్లాలో మాంజా కోతతో బైక్ డ్రైవర్ రోడ్డుపై ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందడం విషాదాన్ని మిగిల్చింది.
సంగారెడ్డి జిల్లాలో చైనా మాంజా వలస కార్మికుడి గొంతు కోసి ప్రాణం తీసింది. సంగారెడ్డి మండలం ఫసల్వాది గ్రామ సమీపంలో బైక్ పై వెళ్తుండగా మాంజా చుట్టుకుని కార్మికుడు రోడ్డుపై ఎగిరిపడ్డాడు. గొంతు బీహార్ కు చెందిన కార్మికుడు అద్వైక్ బైక్ పై వెళ్తుండగా, గొంతుకు చుట్టుకుని అక్కడికక్కడే మృతి చెందాడు. నిషేధిత మాంజా వాడకంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
