చేవెళ్లలో టిప్పర్, బ్రీజా కారు ఢీ..రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో..

చేవెళ్లలో టిప్పర్, బ్రీజా కారు ఢీ..రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో..

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిప్పర్, బ్రీజా కారు ఢీకొనడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం ( మార్చి 3 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి... చేవెళ్ల మండలం దామరగిద్ద దగ్గరున్న పెట్రోల్ బంక్ సమీపంలో టిప్పర్, బ్రీజా కారు ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న పటేల్ ప్రవీణ్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ప్రవీణ్ ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రవీణ్ పూడూరు మండలం కండ్లపల్లి గ్రామవాసిగా గుర్తించారు పోలీసులు. మార్చి 5న ప్రవీణ్ పెళ్లి ఉండటంతో పెళ్లి పనులు చూసుకొని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదం జరిగిన సమయంలో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రెండు రోజుల్లో పెళ్లి ఉండగా ప్రవీణ్ యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడటంతో అతని కుటుంబంలో విషాదం మునిగిపోయింది.