ఫ్రీగా ఐఫోన్ 15 : సంచలనం సృష్టిస్తున్న అమెజాన్ కొత్త ఆఫర్.. జస్ట్ ఈ పని చేస్తే చాలు..

 ఫ్రీగా ఐఫోన్ 15 : సంచలనం సృష్టిస్తున్న అమెజాన్ కొత్త ఆఫర్.. జస్ట్ ఈ పని చేస్తే చాలు..

ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్స్ పండుగ సీజన్ రాగానే కస్టమర్లను ఆకర్శించేందుకు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రవేశపెడుతుంటాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా అమెజాన్ కస్టమర్ల కోసం గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025ను తీసుకువస్తోంది, ఇది సెప్టెంబర్ 23 నుండి ప్రారంభమవుతుంది. అయితే, అమెజాన్ ప్రైమ్ సభ్యులు ఈ ప్రయోజనాన్ని ఒక రోజు ముందు అంటే సెప్టెంబర్ 22 నుండే పొందొచ్చు. ఈసారి డిస్కౌంట్లు, డీల్స్ మాత్రమే కాకుండా అమెజాన్ ఒక ప్రత్యేకమైన పోటీని కూడా తీసుకొస్తుంది, ఇందులో పాల్గొనే కస్టమర్లు ఫ్రీగా  ఐఫోన్ 15ను గెలుచుకోవచ్చు.

అమెజాన్ ఈ పోటీకి "iPhone 15 ప్రైస్ దేఖా క్యా?" అని పేరు పెట్టింది. ఇందులో పాల్గొనడం చాలా ఈజీ. Amazon యాప్‌లోని మొబైల్ విభాగంలో ఐదు ప్రత్యేక iPhone 15 స్టిక్కర్లు దాగి ఉన్నాయి. వాటన్నింటినీ ఒకేసారి కనిపెట్టడం కష్టం, కానీ మీరు ప్రతిరోజూ యాప్‌ తెరిచి వాటిని కనిపెట్టాలి.  

మీరు ఐదు స్టిక్కర్లను కనిపెట్టిన తర్వాత ఈ స్టిక్కర్ల స్క్రీన్‌షాట్ తీసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేయాలి. పోస్ట్ చేస్తున్నప్పుడు, @amazonmobilesinను ట్యాగ్ చేయడం తప్పనిసరి, అలాగే #iPhone15PriceDekhaKya ఇంకా  #AmazonGreatIndianSale అనే రెండు హ్యాష్‌ట్యాగ్‌లు ఉపయోగించడం తప్పనిసరి.

పోటీ  ముఖ్యమైనది ముందుగా పోటీలో పాల్గొనేవారు అమెజాన్ యాప్‌కి వెళ్లి ఐఫోన్ 15ని వారి విష్ లిస్ట్‌లో చేర్చుకోవాలి. ఎవరైన స్టిక్కర్‌లను కనిపెట్టి  ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, ఐఫోన్ 15ని విష్ లిస్ట్‌లో చేర్చకపోతే వారి ఎంట్రీ చెల్లదని గమనించాలి.

ఈ పోటీ 25 సెప్టెంబర్ 2025 వరకు కొనసాగుతుంది అలాగే రాత్రి 11:59 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. ఇందులో పాల్గొనడానికి, పాల్గొనే వ్యక్తికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి అలాగే భారతదేశస్థులై ఉండాలి. ప్రతి వ్యక్తికి ఇందులో ఒక్కసారి మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది.

పోటీ ముగిసిన తర్వాత అమెజాన్ ఐదుగురు అదృష్ట విజేతలను సెలెక్ట్ చేస్తుంది, అలాగే గెలిచిన వారికి ఫ్రీగా ఐఫోన్ 15 గిఫ్ట్ గా  ఇస్తుంది. విజేతలను అమెజాన్ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ప్రకటిస్తారు. పండుగ సీజన్‌లో డిస్కౌంట్ల కోసం ఎదురుచూస్తున్నా ప్రజలు  ఇలాంటి పోటీలు కస్టమర్లకు డబుల్ సర్‌ప్రైజ్‌ ఇస్తుంది. అయిన ఐఫోన్ 15  గెలుచుకునే అవకాశాన్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి....