The Kerala Story 2 Trailer: దేశాన్ని కుదిపేసే కథతో మరింత తీవ్రంగా ‘ది కేరళ స్టోరీ’ సీక్వెల్ ట్రైలర్

The Kerala Story 2 Trailer: దేశాన్ని కుదిపేసే కథతో మరింత తీవ్రంగా ‘ది కేరళ స్టోరీ’ సీక్వెల్ ట్రైలర్

2023లో వచ్చిన ది కేరళ స్టోరీ (The Kerala Story) ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేసిందో చూశాం. అదా శర్మ, సిద్ది ఇదాని, యోగితాముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాను.. సుదీప్తో సేన్ తెరకెక్కించారు. ఈ సినిమాపై కొన్ని చోట్ల ఆందోళనలు జరిగినా.. మౌత్ టాక్తో మంచి విజయం సాధించింది. దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ సినిమా కథ కథనాలు ఎన్నో అలజడులు సృష్టించడమే కాకుండా, ఎంతోమందిని కదిలించింది. ఈ క్రమంలోనే  మేకర్స్ పార్ట్ 2ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. 

ది కేరళ స్టోరీ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన ది కేరళ స్టోరీ 2- Goes Beyond ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. “ఈసారి మౌనంగా ఉండం..” అంటూ మేకర్స్ సోషల్ మీడియాలో ఎమోషనల్ క్యాప్షన్ పంచుకున్నారు. “వాళ్లు మన కూతుళ్లను టార్గెట్ చేశారు. నమ్మకాన్ని వమ్ము చేశారు. భవిష్యత్తును నాశనం చేశారు. ఈసారి మనం మౌనంగా ఉండకూడదు.. సహించేది లేదు.. పోరాడుదాం” అంటూ చేసిన ఈ పోస్టు చిత్రంపై మరింత ఆసక్తిని పెంచింది.

ఇంపాక్ట్ పెంచిన ట్రైలర్‌ కట్ సీన్స్.. 

కామాఖ్య నారాయణ్ సింగ్ డైరెక్ట్ చేసిన కేరళ స్టోరీ2 ట్రైలర్ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇందులో ఉల్కా గుప్తా, ఆదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటించారు. ముగ్గురు హిందూ యువతులు ప్రేమలో పడిన తర్వాత వారి జీవితాలు ఎలా మలుపు తిరిగాయి అనే అంశాన్ని కథ ప్రధానంగా చూపిస్తున్నట్లుగా ట్రైలర్ ఉంది.

ట్రైలర్ ప్రారంభంలోనే ఒక హెచ్చరికతో కథ మొదలవుతుంది. ఇంకా 25 ఏళ్లలో భారత్ ఒక ఇస్లామిక్ రాష్ట్రంగా మారే ప్రమాదం ఉందని వాయిస్ ఓవర్ వినిపిస్తుంది. ఆ తర్వాత కథ రాజస్థాన్‌లోకి మారుతుంది. అక్కడ ఒక హిందూ కుటుంబం తమ 16 ఏళ్ల కుమార్తెను మత మార్పిడికి ప్రేరేపించారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్‌లో పోక్సో  (POCSO) కేసు నమోదు చేయడానికి వెళ్లే సన్నివేశం కనిపిస్తుంది. అక్కడ తల్లిదండ్రులపై వచ్చే సీన్స్ ఎమోషనల్ గా ఉన్నాయి.   

ఆ తర్వాత రెండో కథ మధ్యప్రదేశ్‌కు మారుతుంది. అక్కడ ఒక యువతి ప్రేమ పేరుతో మోసపోయి వివాహం చేసుకున్న తర్వాత మత మార్పిడికి ఒత్తిడి ఎదుర్కొంటుంది. ఆమె అనుభవించే మానసిక వేదన, ఒంటరితనం స్పష్టంగా చూపించారు.

మూడో కథా భాగం కేరళలో సాగుతుంది. ఒక యువకుడు తన ప్రేమికురాలిని లైవ్-ఇన్ రిలేషన్‌షిప్‌కు ఒప్పించి, తరువాత ఆమెపై మత మార్పిడికి ఒత్తిడి తేవడం చూపిస్తారు. ఆమె తన విశ్వాసాన్ని విడిచిపెట్టనని చెప్పినప్పుడు పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతాయి. ఆ తర్వాత ఆయువతిని బంధించి, బలవంతంగా గొడ్డు మాంసం (బీఫ్) తినిపించి చిత్రహింసలకు గురిచేసే సీన్స్ ఉత్కంఠరేపుతున్నాయి.

ఇలా ట్రైలర్లో చూపించిన సీన్స్, సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా చర్చలకు కారణమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇకపోతే, కేరళలో కొంతమంది అమ్మాయిలను బలవంతంగా మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే కథాంశంతో తెరకెక్కించిన సినిమానే ది కేరళ స్టోరీ.