బంగ్లాదేశ్ మాజీ సలహాదారు పదవీనుంచి తప్పుకుంటున్న మహ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన వీడ్కోలు ప్రసంగంలో నోటి దూల ప్రదర్శించారు. పోతూ పోతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి రాజకీయ దుమారం రేపారు. భారత దేశపు సెవెన్ సిస్టర్స్ ను బంగ్లాదేశ్ లోని ఆర్థిక కేంద్రంలో అనుసంధానించాలని యూనస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సెవెన్ సిస్టర్స్ పై యూనస్ రెచ్చగొట్టే స్పీచ్ చేయడంతో అస్సాం బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
భారత్ లోని సెవెన్ సిస్టర్స్ అయిన ఏడు ఈశాన్య రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, త్రిపుర లపై బంగ్లాకు ఎప్పటి నుంచో కన్ను ఉంది. మహ్మద్ అలీ జిన్నా నుంచి నేటి యూనస్ వరకు జుల్ఫికర్ అలీ భుట్టో నుంచి ముజిబుర్ రెహమాన్ వరకు ఇది వారి చిరకాల కోరిక అని బీజేపీ నేతలు మండిపడ్డారు. ముస్లిం లీగ్ ద్వారా సెవెన్ సిస్టర్స్ తోపాటు అస్సాంను స్వాధీనం చేసుకోలేకపోయామే అన్నా బాధ బంగ్లాదేశ్ లో కనిపిస్తోంది. ఇప్పుడు సెవెన్ సిస్టర్స్ , నేపాల్, భూటాన్ వారి కొత్త కోరికల లిస్టు లో చేరాయన్నారు అస్సాంబీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ ఉపాధ్యాయ్.
1975లో వచ్చిన ముజిబుర్ రెహాన్ పుస్తకం తూర్పు పాకిస్తాన్ లో ఇదే అంశాన్ని రాశారని.. అస్సాంలోని విస్తారమైనభూములు బంగ్లాదేశ్ లో పెరుగుతున్న జనభాకు అనుగుణంగా ఉన్నాయని ముజిబుర్ కలలు కన్నాడు. ఆ కలను జుల్ఫికర్ అలీ భుట్లో పంచుకున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. ఆ లక్ష్యం దిశగా ప్రస్తుతం బంగ్లాదేశ్ లో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని వాదించారు. అస్సాంలో అధికార పార్టీ ప్రతిస్పందన అంతర్గత భద్రత ,భూమి సమగ్రతపై పెరుగుతున్న ఆందోళనను హైలైట్ చేసింది. బంగ్లాదేశ్ ప్రయోజనాల దిశగా ఇప్పటికే అస్సాంలోని అనేక కీలక జిల్లాల్లో కనిపిస్తోందని చెబుతున్నారు.
బీఎన్ పీ చీఫ్ తారిఖ్ రెహమాన్ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడుతున్న వేళ..యూనస్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. భారత్ , బంగ్లాదేశ్ మధ్య నెలకొన్న అనిశ్చితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.
