
బ్రిటన్: లండన్లో లక్ష మందికి పైగా రోడ్డెక్కారు. యాంటీ ఇమ్మి గ్రేషన్ ర్యాలీ చేశారు. శనివారం రాత్రి సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే (UK) హిస్టరీలోనే అతి పెద్దది అని పోలీసులు తెలిపారు. లండన్లో వలసలకు వ్యతిరేకంగా సామాజిక కార్యకర్త టామీ రాబిన్సన్ నాయకత్వంలో ‘యునైట్ ది కింగ్డమ్’ ప్రదర్శన జరిగింది. ఈ నిరసనలో సుమారు లక్ష మందికి పైగా ప్రజలు రోడ్డెక్కారు. ఈ ర్యాలీకి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
లక్షా 10 వేల మందికి పైగా ర్యాలీ చేయడంతో రోడ్లపై జనసంద్రం కనిపించింది. ఇదే సమయంలో జాత్యంహకారానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీ కూడా జరిగింది. ఈ ర్యాలీలో కూడా సుమారు 5 వేల మందికి పైగా కనిపించారు. ‘స్టాండ్ అప్ టు రేసిజమ్’ అనే పేరుతో ఈ ర్యాలీ జరిగింది. ఈ రెండు గ్రూపుల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉండటంతో పోలీసులు భారీగా మోహరించారు. ఈ క్రమంలో.. కొందరు నిరసనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. "యునైట్ ది కింగ్‌డమ్" ర్యాలీలో కొందరు నిరసనకారులు పోలీసులపై సీసాలు విసిరారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు నిరసనకారులు పోలీసులపై దాడి చేశారు.
నిరసనకారులు చేసిన ఈ దాడుల్లో 26 మంది పోలీసులు గాయపడగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు పోలీసులపై ముఖంపై దాడి చేయడంతో దంతాలు ఊడిపోయాయి. ముక్కు పగిలింది. ఈ హింసాత్మక ఘటనలో పోలీసులు పాతిక మందికి పైగా నిరసనకారులను అరెస్ట్ చేశారు. వెయ్యి మందికి పైగా పోలీసులు ర్యాలీ జరిగిన ప్రాంతంలో మోహరించారు. ఇక ఈ ర్యాలీకి నాయకత్వం వహించిన రాబిన్సన్ అసలు పేరు స్టీఫెన్ యాక్స్లీ-లెన్నాన్.
జాతీయవాద, ఇస్లాం వ్యతిరేక ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్‌ను స్థాపించారు. బ్రిటన్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరు. ఈ ర్యాలీని వాక్ స్వాతంత్య్రానికి మద్దతుగా జరిగిన ఒక ప్రదర్శనగా ఆయన చెప్పుకొచ్చారు. ఈ ర్యాలీలో లక్ష మందికి పైగా పాల్గొన్నప్పటికీ నవంబర్ 2023లో జరిగిన పాలస్తీనా అనుకూల ర్యాలీకి దాదాపు 3 లక్షల మందికి పైగా హాజరైన సంగతి తెలిసిందే. అతిపెద్ద ర్యాలీల్లో ఇప్పటికీ పాలస్తీనా అనుకూల ర్యాలీనే ముందుండటం గమనార్హం.
The guardian reported "110k" at our London rally today.
— Tommy Robinson 🇬🇧 (@TRobinsonNewEra) September 13, 2025
Yet, literally had their own helicopter showing the millions of patriots 🤡
Legacy media proving again they'll just lie to your face for their own agenda.
This is why nobody trusts them.
We are the media now. pic.twitter.com/s0yOh2NEfe