రష్యా వైపు భారత్ చూపు..క్రూడ్ ఆయిల్ దిగుమతికి యత్నం

రష్యా వైపు భారత్ చూపు..క్రూడ్ ఆయిల్ దిగుమతికి యత్నం
  • క్రూడ్ ఆయిల్ దిగుమతికి యత్నం
  •  ఇప్పటికే పరిశ్రమలకు గ్యాస్ సరఫరా 
  • తగ్గించిన ఆయిల్ కంపెనీలు
  • అడ్డొస్తున్న అమెరికా టారిఫ్స్
  •  కీలక నిర్ణయం దిశగా అడుగులు
  • అత్యవసర పరిస్థితి కాబట్టి పరవాలేందంటున్న అధికారులు

ఢిల్లీ: ఇంధన కొరతను అధిగమించేందుకు భారత్ రష్యా వైపు చూస్తోంది. పశ్చిమాసియాలో ఏర్పడ్డ ఉద్రిక్త పరి స్థితులు.. ఇరాన్ హార్ముజ్ జలసంధిని మూసి వేయడంతో భారత్ కు రోజూ రావాల్సిన ముడి చమురు రావడం లేదు. దీంతో రోజు రోజుకూ దేశంలో పెట్రో నిల్వలు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. ఇంధన సరఫరా అస్థిరతను ఎదుర్కోవడానికి రష్యా నుండి క్రూడ్ దిగుమతులను పెంచే ఆలోచనలో ఉంది. 

►ALSO READ | ముందుంది ముసళ్ల పండగ : ఈ నెలకు పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు లేదు..!

దేశ ఇంధన అవసరాల్లో సుమారు 89% క్రూడ్ ఆయిల్, 50% గ్యాస్ దిగుమతులపై ఆధారపడుతోంది. ఖతార్ నుంచి రా వాల్సిన ఎల్ ఎన్ జీ నిలిచిపోవడంతో పరిశ్రమలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భారత్లోని ప్రధాన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే గ్యాస్ సరఫరాను పరిశ్రమలకు తగ్గించడం ప్రారంభించాయి. దేశంలో సరసమైన ధరలకు పెట్రో ఉత్పత్తులను అందిం చేందుకు అన్ని చర్యలు తీసుకుంటు న్నట్టు పెట్రోలియం రసాయనాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెప్పారు. భారత- యుఎస్ మధ్య మధ్యవర్తి టారిఫ్ ఒప్పందం ప్రకారం, రష్యా మీద ఆధారాన్ని తగ్గించడం ఒక షరతుగా ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో, రష్యా క్రూడ్ వినియోగం పెంపు జరు గవచ్చని అధికారులు తెలిపారు. ఇది భారతదేశం ఇంధన భద్రతను కాపాడే మార్గమని అంటున్నారు.