
ఢిల్లీలో గ్రేటర్ నోయిడా వెస్ట్ లోని ఏస్సిటీలో ఓ మహిళ కొడుకుతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది.11ఏండ్ల కొడుకుతో కలిసి భవనం13 వ అంతస్తు బాల్కనీ నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకుంది. బాలుడు న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని మానసికంగా కృంగిపోయిన ఆమహిళ ఆత్మహత్యకు పాల్పడిఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
గ్రేటర్ నోయిడా వెస్ట్ లోని ఏస్ సిటీలో శనివారం ఉదయం 37 ఏళ్ల మహిళ, ఆమె 11 ఏళ్ల కుమారుడు తమ ప్లాట్ లోని 13వ అంతస్తు బాల్కనీ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలుడు న్యూరో డెవలప్ మెంటర్ డిజార్డర్ కు చికిత్స పొందుతున్నాడని, క్రమం తప్పకుండా మందులు వాడుతున్నాడని పోలీసులు తెలిపారు. ఫ్లాట్ నుంచి స్వాధీనం చేసుకున్న నోట్ లోఆ మహిళ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. చార్టర్డ్ అకౌంట్ గా పనిచేస్తున్న చిన్నారి తండ్రి మరో గదిలో ఉండగా అరుపు విని పరుగెత్తి చూడగా భార్య, కొడుకు కింద నేలపై పడి మృతిచెందినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టమ్ కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
ఆమె రాసిన సూసైడ్ లెటర్..
మేం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్తున్నాం.. క్షమించండి.. మేం ఇకపై మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదనుకుంటన్నాం.. మా వల్ల మీ జీవితం నాశనం కాకూడదు. మా చావుకు ఎవరూ బాధ్యులు కాదు అని మహిళ సూసైడ్ నోట్ లో రాసినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఆ చిన్నారి చాలా కాలంగా చికిత్స పొందుతోందని..పాఠశాలకు వెళ్లడం లేదని, మందులపైనే ఎక్కువగా ఆధారపడి ఉందని అపార్టుమెంట్ లోని ఉండేవాళ్లు తెలిపారు. చేతివ్రాత నిపుణులతో నోటును పరిశీలిస్తున్నారు.