
లోక్ సభ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ భారీ షాక్ తగిలింది. మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. మే 1 (ఈరోజు) రాత్రి నుంచి 48 గంటలపాటు బీఆర్ఎస్ అధినేత ప్రచారానికి ఈసీ బ్రేక్ వేసింది. సిరిసిల్ల సభలో కాంగ్రెస్ పార్టీపై కేసీఆర్ అభ్యంతకర వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ ఈ చర్య తీసుకుంది. కేసీఆర్ బస్సు యాత్రలో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈసీ 48 గంటలపాటు కేసీఆర్ ప్రచారంపై నిషేదం విధించింది. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు నిషేదం అమలులో ఉంటుంది.
కేసీఆర్ బస్సు యాత్రలో 5సార్లు అసభ్య పదజాలాన్ని వాడారని ఎన్నికల కమిషన్ తెలిపింది. కుక్కల కొడుకులు, ఈ పరిస్థితి నీటి విలువ తెలియని లత్కోర్ల వల్ల వచ్చిదని అన్నారు. చేతకాని దద్దమ్మ ప్రభుత్వం, చవట అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుషించారు. రైతులకు రూ.500 బోనస్ ఇవ్వకుంటే గొంతు కొరికి సంపుతా అని పదాలు కేసీఆర్ ప్రచారంలో మాట్లాడారు. ఈ మాటలను ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకుంది. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏప్రిల్ 24న కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి మొదలైన రోడ్ ప్రస్తుతం పలు జిల్లాల మీదుగా కొనసాగుతుంది.