12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..

12 ఏళ్ల తరువాత  వృషభ రాశిలోకి  బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..

దేవ గురువు బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశి ప్రయాణించేందుకు ఏడాది సమయం పడుతుంది.  బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి మే 1 వ తేదీన  సంచరిస్తారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహ సంచారం నాలుగు రాశుల వారి అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది.  వృషభరాశిలో బృహస్పతి సంచారం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం  ఏరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. . .

దాదాపు 12 సంవత్సరాల తర్వాత బృహస్పతి మే ఒకటవ తేదీన మధ్యాహ్నం 2: 22 నిమిషాలకు వృషభరాశిలోకి వెళుతుంది. బృహస్పతి ఏ రాశిలోకి వెళ్లిన, మళ్లీ రాశిలోకి రావడానికి 12ఏళ్ల కాలం పడుతుంది.బృహస్పతి 12 ఏళ్ల తర్వాత మళ్లీ వృషభరాశిలోకి వస్తుంది. బృహస్పతి వృషభ రాశి సంచారం ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. దేవగురువుగా పరిగణించే బృహస్పతి మే 1న వృషభరాశిలోకి ప్రవేశించగా జూన్ 12న రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 9న తిరోగమన దశలో సంచరిస్తాడు. మళ్లీ ఫిబ్రవరి 4, 2025న ప్రత్యక్ష మార్గంలో ప్రయాణిస్తాడు. చివరిగా మే 14న వృషభ రాశి నుంచి నిష్క్రమించి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మళ్ళీ బృహస్పతి వచ్చే ఏడాది వరకు ఇదే రాశిలో కదలికలు మార్చుకుంటూ సంచరిస్తాడు.

మేషరాశి:   బృహస్పతి ... వృషభ రాశి సంచారం వలన ఈ రాశి  వారికి ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది.  విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం.  ఉద్యోగులకు వేతనం పెరిగి ప్రమోషన్​ వచ్చే అవకాశం కలదు.  ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి.  వ్యాపారస్తులు  కొత్త పెట్టుబడుడులు పెట్టేందుకు అనుకూలమైన సమయం. మేషరాశి జాతకులు ఈ సమయంలో విందులు, వినోదాలు, విలాసాలలో గడుపుతారు. ఆర్థిక సమృద్ధి తో బృహస్పతి మేషరాశి జాతకులను ఆశీర్వదిస్తాడు.

వృషభ రాశి :  వృషభ రాశిలో బృహస్పతి సంచారం వలన ఈ రాశి వారికి అనుకూల ఫలితాలు ఉండకపోవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. జీర్ణ క్రియ, జీవక్రియ వంటి సమస్యలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యల గురించి అప్రమత్తంగా ఉండటం అవసరం. వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు, ఆర్థిక విషయాలపై వ్యాపార భాగస్వాములతో తగాదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. సంబంధాలలో ఉద్రిక్తత ఏర్పడుతుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంది. మనసు నెగిటివ్ ఫీలింగ్ తో నిండిపోతుంది. జీవిత భాగస్వామితో విభేదాలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది.  ఎక్కువ సమయం దైవ చింతనలో గడపండి.  దైవానుగ్రహంతో కొంత సానుకూలత ఏర్పడుతుంది. 

మిథున రాశి:.  బృహస్పతి .. వృషభరాశిలో సంచరించుట వలన మిధున రాశి వారికి అనుకోకుండా ఖర్చులు పెరుగుతాయి.  ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఉద్యోగస్తులకు కొన్ని ఆటంకాలు ఏర్పడుతాయి.  భూమికి సంబంధించి కొన్ని చిక్కులు వస్తాయి.  తల్లి ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.విద్యార్థులు కష్టపడితే కాని ఫలితం రాదు.   నిత్యం ఆదిత్యహృదయం.. సూర్యాష్టకం పఠించండి. 

కర్కాటక రాశి :వృషభరాశిలో బృహస్పతి సంచారం ... కర్కాటక రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది.  ఇప్పటి వరకు ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. . కొత్తగా పెళ్లైన దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వ్యాపారులకు విదేశాల నుంచి పెద్ద పెద్ద ఆర్డర్లు వస్తాయి. ఉద్యోగస్తులకు అనుకోకుండా పదోన్నతి లభిస్తుంది.   మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది.

సింహరాశి:  బృహస్పతి... వృషభ రాశి సంచారం వలన  సింహ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది.  పూర్వీకుల ఆస్తి ఈ  సమయంలో వచ్చే అవకాశం ఉంది. భూములు లేదా నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో కొనుగోలు చేసే ఆస్తులు దీర్ఘకాలంలో మీకు ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈ సమయంలో రుణాలు తీసుకోకుండా ఉండాలని జ్యోతిష్య పండితులు సలహా ఇస్తున్నారు. 

కన్యారాశి : బృహస్పతి సంచారం కన్యా రాశికి అంత ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. ఆర్థికపరమైన జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి. జీవితంలో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. పనులు పూర్తి చేయడంలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది.

తులారాశి :తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు బృహస్పతి.. వృషభ రాశిలో  సంచారం వలన  ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. తోబుట్టువులతో సంబంధాలు బలహీన పడతాయి. ఆరోగ్యంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కెరీర్ కోసం చాలా కష్ట పడాలి. కార్యాలయంలో సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అప్పులు తీసుకోకుండా ఉండటం మంచిది. బృహస్పతి బలహీన స్థానం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడికి ఒత్తిడికి దూరంగా ఉండండి.

వృశ్చికరాశి : బృహస్పతి...  వృషభ రాశి సంచారం వృశ్చిక రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. వృశ్చిక రాశి జాతకుల ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో మెరుగుపడుతుంది. వృశ్చిక రాశి జాతకుల నెలవారి ఆదాయం మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ వనరుల సూచనలు ఉన్నాయి. ఉద్యోగం చేసే వారికి ఇంక్రిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో సౌకర్యవంతంగా విలాసవంతంగా జీవితాన్ని గడుపుతారు. కొత్తగా గృహయోగం.. వాహన యోగం లభించే అవకాశం కలదు. 

ధనుస్సు రాశి:  బృహస్పతి పాలించే ధనుస్సు రాశి వారికి కూడా సవాళ్ళు ఎదురుకాబోతున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. చట్టపరంగా అనేక చిక్కులు ఎదురవుతాయి. వాటి నుంచి బయటపడటం చాలా కష్టంగా మారుతుంది. ఆర్థిక వ్యయాలు కూడా పెరుగుతాయి. ఆస్తికి సంబంధించిన విషయాల్లో గొడవలు జరుగుతాయి.

మకరరాశి:  వృషభ రాశిలో బృహస్పతి సంచారం వలన  ప్రేమ విషయంలో మార్పులు చోటు చేసుకొనే అవకాశం కలదు.  ఆర్థికంగాపురోగతి ఉంటుంది.  విద్యార్థులకు విదేశీ ప్రయాణం కలిసి వచ్చే అవకాశం ఉంది.  వారసత్వంగా వచ్చే ఆస్తి లభిస్తుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి.  వ్యాపార రంగంలో  ఉన్న వారికి కొత్త పెట్టుబడులు పెడితే అధికంగా లాభాలు వస్తాయి.

కుంభరాశి:  బృహస్పతి వృషభ రాశి సంచారం వల్ల కుంభ రాశి జాతకులకు ఊహించని ధనలాభం కలుగుతుంది. పూర్వీకులకు సంబంధించిన ఆస్తి వచ్చే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. మతపరమైన కార్యక్రమాలతో పాటు, కుటుంబ అవసరాలను తీర్చడానికి ఈ సమయంలో మీరు డబ్బు ఖర్చు చేస్తారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. రుణ బాధల నుండి విముక్తి పొందడానికి ఈ సమయం మీకు ఉపయోగపడుతుంది.

మీనరాశి:  మీన రాశికి బృహస్పతి అధిపతిగా ఉంటాడు. అయితే దేవ గురువు సంచారం ఈ రాశి వారికి ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు. మీన రాశి మూడో ఇంట్లో గురు సంచారం జరుగుతుంది. ఫలితంగా పనుల్లో బద్ధకంగా ఉంటారు. పనులు వాయిదా వేసే ధోరణి కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుగుచుకోవాలి. విజయం సాధించేందుకు శ్రద్ధ, పట్టుదల చాలా అవసరం. సోమరితనం కంటే పనికి ప్రాధాన్యత ఇవ్వాలి.