ఇంటర్ స్టూడెంట్స్ అలర్ట్: సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు లాస్ట్ డేట్

ఇంటర్ స్టూడెంట్స్ అలర్ట్: సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు లాస్ట్ డేట్

తెలంగాణలో ఇంటర్ ఫెయిలైయిన విద్యార్థులకు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు గడువు మే2న (రేపటితో) ముగియనుంది. సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నిర్ణీత గడువులోగా పరీక్ష ఫీజు చెల్లించాలి. విద్యార్థులకు కాలేజీల్లో ఫీజు చెల్లించేందుకు మే 2, ప్రిన్సిపల్స్ ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించేందుకు మే 3 వరకు గడువు విధించారు. బోర్డ్ ఇచ్చిన షెడ్యూలు ప్రకారం మే 24 నుంచి జూన్ 3 వరకు ఇంట‌ర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. 
 
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్ట్ ఈయర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండ్ ఈయర్ ఎగ్జామ్ ఉంటాయి. సప్లిమెంటరీ పరీక్షల కోసం ఇంటర్మీడియట్‌ విద్యార్థులు పేపర్లతో సంబంధం లేకుండా రూ.460 పరీక్ష పీజు, ప్రాక్టికల్స్‌కు రూ.170, బ్రిడ్జి కోర్సులకు రూ.120 లు చెల్లించాల్సి ఉంటుంది. ఇంప్రూవ్‌మెంట్‌ ఎగ్జామ్స్ స్టూడెంట్స్ పరీక్ష ఫీజుతో పాటు ఒక్కో పేపర్‌కు రూ.160 చొప్పున చెల్లించాలి. మొదటి, రెండో సంవత్సరం ఇంప్రూవ్‌మెంట్‌ రాయాలనుకుంటే.. సైన్స్‌ విద్యార్థులు రూ.1200, ఆర్ట్స్‌ విద్యార్థులు రూ.1050 చెల్లించాల్సి ఉంటుంది.