గడ్కరిని హైవై మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

గడ్కరిని హైవై మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఏపీలో జాతీయ రహదారులకు శంకుస్థాపన సందర్భంగా శనివారం ( ఆగస్టు 2 ) మంగళగిరిలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ 29 జాతీయ రహదారుల ప్రాజెక్టులు రూ. 5 వేల కోట్ల విలువచేసే పనులకు శంకుస్థాపన జరుగుతోందని అన్నారు. ఇవాళ్టి కార్యక్రమం భారత ఐక్యతకు పునాది అని అన్నారు. గడ్కరీ దూరదృష్టి, పట్టుదల ప్రత్యేకం అని.. ఆయనను హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా అంటరాని అన్నారు.

భారత రత్న వాజ్ పేయి దేశ రహదారులను మార్చి ముందడుగు వేశారని అన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రభావవంతమైన నాయకులుగా మోడీ గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. వికసిత భారత్ వైపు ప్రయాణం చేస్తున్నామని అన్నారు. గడ్కరీ దూరదృష్టి ప్రత్యేకమని.. దేశంలో లక్ష 46 కిలోమీటర్ల జాతీయ రహదారులు పెరిగాయని అన్నారు. నిర్మాణ వేగం మూడు రెట్లు, బడ్జెట్ ఆరు రెట్లు పెరిగిందని అన్నారు.

గత ప్రభుత్వం కూల్చివేతలతో మొదలైతే.. ప్రతి గ్రామంలో గుంతలు పూడ్చి కొత్త రహదారులను నిర్మిస్తోందని అన్నారు. కూటమి ఐక్యతను దెబ్బతీసే కుట్రలన్నీ ఐక్యతతో ఛేదిద్దామని అన్నారు పవన్ కళ్యాణ్. కూటమి నాయకుల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినా పరిష్కరించుకొని కలిసికట్టుగా ముందుకు సాగాలని అన్నారు.