యూఎస్ టార్గెట్ ఫార్మా సెక్టార్.. 24,600 పడిపోయిన నిఫ్టీ 50.. ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి..?

యూఎస్ టార్గెట్ ఫార్మా సెక్టార్.. 24,600 పడిపోయిన నిఫ్టీ 50.. ఇన్వెస్టర్లు ఇప్పుడు ఏం చేయాలి..?
  • కొనసాగిన మార్కెట్ పతనం
  • నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 3 శాతానికి పైగా క్రాష్
  • 24,600 పడిపోయిన నిఫ్టీ 50
  • ఇన్వెస్టర్లు వేచి చూసే స్ట్రాటజీ ఫాలో అవ్వాలని ఎనలిస్టుల సలహా

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు శుక్రవారం కూడా నష్టాల్లో కదిలాయి. యూఎస్ టారిఫ్ లు, విదేశీ ఇన్వె స్టర్లు షేర్లను అమ్మేస్తుండడం, రూపాయి విలువ క్షీణించడం వంటి కారణాలతో బెంచ్ మార్క్ ఇండె క్స్లు సుమారు ఒక శాతం నష్టపోయాయి. వీటికి తోడు ట్రంప్ వైఖరితో ఫార్మా రంగంపై ఒత్తిడి పెరు గుతోంది. సెన్సెక్స్ శుక్రవారం 585.67 పాయింట్లు (0.72శాతం) క్షీణించి 80,599.91 వద్ద, నిఫ్టీ 203 పాయింట్లు (0.8.2శాతం) పతనమై 24,565.35 వద్ద ముగిశాయి.

మార్కెట్ పతనానికి కారణాలు..

అమెరికా టారిఫ్ : యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఇండియా నుంచి దిగుమతి చేసుకునే వస్తువు లపై 25శాతం టారిఫ్ విధించారు. రష్యానుంచి డిఫెన్స్, క్రూడాయిల్ కొంటున్నందుకు అదనంగా పెనాల్టీ వేస్తామని ప్రకటించారు. కానీ, ఇది ఇంకా అమల్లోకి రాలేదు. అయినప్పటికీ, అమెరికా-భారత ట్రేడ్ ఒప్పందంపై అనిశ్చితి పెరిగింది. మరోవైపు ఆగస్టు 1 డెడ్లైన్ ముగియడంతో సుమారు 70 దేశాలపై టారిఫ్ ను ట్రంప్ ప్రకటించారు.

ఎఫ్ఐల అమ్మకాలు: ఫారిన్ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు (ఎస్ఐఐలు) గురువారం నికరంగా రూ.5,588.91 కోట్ల విలువైన షేర్లను, శుక్రవారం మరో రూ.2,800 కోట్ల విలువైన షేర్లను అమ్మారు. గత 9 సెషన్లలో నికరంగా రూ.30 వేల కోట్లను మార్కెట్ నుంచి విత్రా చేసుకున్నారు. ఇండెక్స్ ప్యూచర్స్లో 90శాతం షార్ట్ పొజిషన్స్ ఉన్నాయి. మార్కెట్ పడుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి.

గ్లోబల్ మార్కెట్లు: ఆసియా మార్కెట్లు యూఎస్ టారిఫ్లు, యూఎస్ జాబ్స్ డేటా ఆందోళనలతో క్షీణించాయి. ఎంఎస్సీఐ ఆసియా పసిఫిక్ ఇండెక్స్ (జపాన్ మినహా) 1.5శాతం పడిపోయి, వారంలో 2.7శాతం నష్టపోయింది. జపాన్ నిక్కీ శుక్రవారం 0.6శాతం, చైనా బ్లూ చిప్స్ 0.5శాతం, హాంగ్్కంగ్ హాంగ్ సెంగ్ 1 శాతం పడ్డాయి. యూరప్ స్టాక్స్ 600 ఒకశాతం లాస్ ట్రేడయ్యింది. యూఎస్ మార్కెట్లు కూడా ఒకటిన్నర శాతం నష్టపోయాయి.

బలపడిన డాలర్: డాలర్ ఇండెక్స్ ఈ వారంలో 2.5శాతం పెరిగి 100 దాటింది. రెండు నెలల గరిష్టానికి చేరుకుంది. ఫలితంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి విదేశీ పెట్టుబ డులు వెళ్లిపోతున్నాయి. లార్జ్క్యప్ స్టాక్స్ పై ఒత్తిడి పెరుగుతుందని, ఇన్వెస్టర్లు వేచి చూసే స్ట్రాటజీని పా టించాలని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ సలహా ఇచ్చారు.

ఫార్మా రంగంపై ఒత్తిడి: యూఎస్ లో అమ్మేమందుల ధరలు అంతర్జాతీయ బెంచ్ మార్క్ కు సమానంగా ఉండాలని, 60 రోజుల్లో మోస్ట్ ఫేవర్డ్ నేషన్స్ (ఎం ఎఫ్ఎన్) ప్రైసింగ్ పాటించాలని 17 గ్లోబల్ ఫార్మా కంపెనీలకు వైట్ హౌస్ లేఖలు రాసింది. దీంతో నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ శుక్రవారం 3.3శాతం పతనమైంది. సన్ ఫార్మా 4.5 శాతం క్షీణించింది. వెల్త్ మేనేజ్మెం ట్ కంపెనీ ఇన్వెస్టెక్ ఈ షేరుపై రేటింగ్ను “బయ్” నుంచి "సెల్" కు డౌన్లోడ్ చేసింది. అరబిందో ఫార్మా, సిప్లా, లుపిన్, గ్లాండ్ ఫార్మా కూడా నష్టపోయాయి.

టెక్నికల్ ఎనాలసిస్: "నిఫ్టీ 200డీఎంఏ, 50 ఈఎంఏ లెవెల్స్న తిరిగి చేరుకోలేకపోయింది. కీలక లెవెల్ 24,600 కిందకు జారింది. నిఫ్టీ రానున్న సెషన్లలో 24,400-24,450 వరకు పడొచ్చు. 24,450 సపోర్ట్ బ్రేక్ అయితే 24,180 (200డే ఈఎంఏ) రీటెస్ట్ అయ్యే అవకాశం ఉంది. పైన 24,800-25,000 జోన్ వద్ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటుంది" అని ఎల్కీపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్ని కల్ అనలిస్ట్ రూపక్ డే అన్నారు.