హైదరాబాద్: నూతన సంవత్సర ఉత్సవాల్లో మన బిర్యానీ కింగ్ గా నిలిచింది. నిన్న రాత్రి 7.30 గంటలు దాటకముందే దేశవ్యాప్తంగా 2,18,993 బిర్యానీ ఆర్డర్లు వచ్చాయి. 'ఇంకా రాత్రి కాకముందే ఇన్ని ఆర్డర్లా.. బిర్యానీనిజంగా కింగ్' అంటూ స్విగ్గీతన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కేవలం బిర్యానీ మాత్రమే కాదు.. రాత్రి 9 గంటల సమయానికి 90,000 పైగా బర్గర్లు కూడా డెలివరీ అయ్యాయంటోంది స్విగ్గీ.ఈ ట్రెండ్స్ ఒక్కో సిటిలో ఒక్కోలా ఉన్నాయి.
దేశమంతా బిర్యానీ కోసం ఎగబడుతుంటే..టెక్ సిటీ బెంగళూరులో మాత్రం సీన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. అక్కడ సుమారు 2,000 మంది న్యూ ఇయర్ వేడుకల వేళ సలాడ్స్ ఆర్డర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరికొందరుమాత్రం అసలైన 'కంఫర్ట్ ఫుడ్' కిచిడీని నమ్ము కున్నారు. సుమారు 9,000 మంది కిచిడీ ఆర్డర్ చేయగా.. 'వీళ్లంతా రాత్రి 10గంటలకే పడుకు నేలా ఉన్నారు' అని స్విగ్గీ సరదాగా వ్యాఖ్యానిం చింది. ఇక స్వీట్స్ విషయానికి వస్తే.. 8,000 మంది వేడివేడి 'గాజర్ కా హల్వా'తో కొత్త ఏడాదికి స్వాగతం పలికారు.
