యాదగిరి గుట్ట ఆలయ ఈవో రాజీనామా..అసలు కారణం ఇదే..

యాదగిరి గుట్ట ఆలయ ఈవో రాజీనామా..అసలు కారణం ఇదే..

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో వెంకట్ రావు రాజీనామా చేశారు. వెంకట్ రావు రాజీనామాను ఆమోదిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాను  వ్యక్తిగత కారణాలు,ఆరోగ్య సమస్యల కారణంతోనే రాజీనామా చేసినట్టు తెలిపారు వెంకట్ రావు .  

దేవాదాయ శాఖ కమిషనర్ గా ఆలయ ఈవోగా అప్పట్లో ఉన్న వెంకట్రావు .. రిటైర్మెంట్ తర్వాత యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవోగా పని చేశారు.  వెంకట్​రావును రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 31,2025న  యాదగిర గుట్ట ఆలయ ఈవోగా నియమించింది. 

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో  భాగంగా మూడోరోజైన గురువారం ఉదయం రామావతారం, సాయంత్రం వేంకటేశ్వరస్వామి అలంకార సేవలు చేపట్టారు. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు భారీగా వచ్చారు.  రద్దీకి అనుగుణంగా నిరంతరాయంగా స్వామివారి దర్శనం చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. ఇక భక్తులు ఎంతమంది వచ్చినా సరిపడేలా.. ఎక్కువ సంఖ్యలో లడ్డూలు, పులిహోర ప్రసాదాన్ని స్పెషల్ గా తయారు చేసి సిద్ధంగా ఉంచారు.