యాదాద్రి, వెలుగు: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు, రూల్స్ ప్రకారం చైర్ పర్సన్ల ఎన్నిక నిర్వహించాలని కలెక్టర్ హనుమంతరావు ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల స్పెషల్ ఆఫీసర్స్, మున్సిపల్ కమిషనర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఎన్నికైన కౌన్సిలర్లతో ముందుగా ప్రమాణ స్వీకారం జరిపించాలని, ఆ తర్వాతే చైర్ పర్సన్, వైస్‌చైర్‌పర్సన్ ఎన్నిక జరపాలని సూచించారు.
ప్రమాణ స్వీకారం, చైర్ పర్సన్ల ఎన్నిక కోసం ఒక్కో మున్సిపాలిటీకి ఒక్కొక్కరిని ఆథరైజ్డ్ ఆఫీసర్‌గా నియమించారు. భువనగిరి మున్సిపాలిటీకి అడిషనల్ కలెక్టర్ ఏ భాస్కరరావు, యాదగిరిగుట్టకు డీఆర్డీవో నాగిరెడ్డి, పోచంపల్లికి డీపీవో విష్ణువర్ధన్ రెడ్డి, ఆలేరు, చౌటుప్పల్ మున్సిపాలిటీలకు ఆర్డీవోలు కృష్ణారెడ్డి,శేఖర్ రెడ్డిని నియమించారు. మీటింగ్‌లో మాస్టర్ ట్రైనర్స్ నర్సిరెడ్డి, హరినాథ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు ఉన్నారు.
