హాలియా, వెలుగు: మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా నల్గొండ జిల్లా అనుముల మండలం పేరూరు గ్రామం ముస్తాబవుతోంది. ఈనెల15 నుంచి 18 వరకు మూడు రోజులపాటు జరిగే జాతర కోసం దేవాలయ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. పాలకవర్గం శనివారం మహాశివరాత్రి ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఆదివారం బ్రహ్మోత్సవాలు, సోమవారం ఉదయం శివ పార్వతుల కల్యాణం, మంగళవారం ఆర్కెస్ట్రా, మహా అన్నదాన, పూర్ణాహుతి అగ్నిగుండాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ చైర్మన్ రిక్కల కొండారెడ్డి తెలిపారు. నేటి నుంచి 17 వరకు జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు 16, 17 తేదీల్లో జిల్లా గ్రామీణ స్థాయి మహిళ కోలాటం పోటీలు, 17 న ముగ్గుల పోటీలను నిర్వహించనున్నారు.
