
భర్తపై ఇంత కోపం..కసినా..? ఇంత క్రూరమెంటాల్టీనా..? భర్తను చంపాలని సోదరులతో కలిసి కుట్ర చేసి..సుపారీ గ్యాంగ్ కు డబ్బులిచ్చి పథకం ప్రకారం ఆపై కాళ్లు చేతులు విరగ్గొట్టి..సజీవంగా ఖననం చేయాలనుకుంది..యూపీలోని బరేలీలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. వివరాల్లోకి వెళితే..
యూపీలోని బరేలీలో ఇజ్జత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతానికి చెందిన రాజీవ్ అనే వ్యక్తి తీవ్ర గాయాలతో జూలై 21 అర్థరాత్రి ఆస్పత్రిలో చేరాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి అతన్ని ఆస్పత్రిలో చేర్పించాడు.. ఆ వ్యక్తే గనక రాకపోతే.. పరిస్థితి మరోలా ఉండేది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజీవ్ ఓ డాక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. పదహారేళ్ల క్రితం సాధన అనేక స్థానిక మహిళతో పెళ్లైంది. వారికి ఇద్దరు పిల్లలున్నారు. మొదట్లో సవ్యంగా కాపురం చేశారు. ఇటీవల రాజీవ్, సాధన మధ్య గొడవలు తలెత్తాయి..గొడవలు ముదిరి చంపుకునే స్థాయికి చేరాయి. ఎలాగైన భర్తను చంపాలనుకున్న సాధన సోదరులతో కలిసి భర్త రాజీవ్ హత్యకు ప్లాన్ చేసింది.
ALSO READ : అత్యాచారం కేసు..కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు
అనుకున్నట్లుగానే భర్త ను హత్య చేసేందుకు సాధన ముహూర్తం ఫిక్స్ చేసింది. భర్తను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ ను ఏర్పాటు చేసింది. జూలై 21న అర్థరాత్రి విధులు ముగించుకొని ఇంటికి తిరిగి వస్తున్న భర్త రాజీవ్ పై సోదరులు, సుపారీ గ్యాంగ్ సభ్యులతో కలిసి దాడి చేసింది. మొదట కాళ్లు చేతులు విరగ్గొట్టారు.అనుకున్న పథకం ప్రకారం.. ఆ తర్వాత సజీవంగా రాజీవ్ ను ఖననం చేసేందుకు సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారు.దాదాపు పని పూర్తయ్యే సమయంలో కథ అడ్డం తిరిగింది..
రాజీవ్ కాళ్లు చేతులు విరిగి నొప్పి వేస్తున్న కేకలతో అటుగా వెళ్తున్న వ్యక్తి గమనించడంతో సాధన ప్లాన్ విఫలమైంది. అటుగా వచ్చిన స్థానికుడు ఘటనస్థలానికి రావడంతో రాజీవ్ బతికి బయటపడ్డాడు. స్థానికున్ని చూసిన సాధన గ్యాంగ్ అక్కడినుంచి పారిపోయింది.
రాజీవ్, అతని తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాధన, ఆమె ఆరుగురు అన్నదమ్ములను అరెస్ట్ చేశారు. దర్యాప్తు కొనసాగుతోంది.