- జనవరిలో 26 కీలక కేసులను
- ఛేదించిన హైదరాబాద్పోలీసులు
- 65 కోట్లలో రూ.71.91 లక్షలు రీఫండ్
హైదరాబాద్ సిటీ, వెలుగు : హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గత నెలలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలకు చెందిన 37 మంది సైబర్క్రిమినల్స్ను పట్టుకున్నారు. ఈ ఆపరేషన్లలో 26 కీలక కేసులను ఛేదించారు. జనవరిలో సైబర్ క్రైమ్ స్టేషన్‌లో 117 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఇందులో ఇన్వెస్ట్‌మెంట్ చీటింగ్ కేసులు15, డిజిటల్ అరెస్ట్ లకు సంబంధించినవి 2, సోషల్ మీడియా స్కామ్స్4, బిజినెస్, -గేమింగ్, -జాబ్ ఫ్రాడ్స్ ఐదు కేసులు ఉన్నాయి. మొత్తంగా నిందితులు రూ.65 కోట్లను కొల్లగొట్టారు. ఈ కేసుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో 37 మందిని అరెస్ట్‌చేసి బాధితులకు రూ.71.91 లక్షలు రీఫండ్ చేయించారు.
నిందితుల నుంచి 26 మొబైల్స్, 79 సిమ్‌లు, 62 డెబిట్ కార్డులు, 57 చెక్ బుక్స్ స్వాధీనం చేసుకున్నారు. ఒక కీలక కేసులో యూకేలో ఇంజినీర్‌గా పని చేస్తున్నట్టు నటించిన మహిళా నిందితురాలు మ్యాట్రిమొనీ సైట్ ద్వారా నగరానికి చెందిన వ్యక్తికి దగ్గరై ఫేక్ క్రిప్టో ప్లాట్‌ఫాం బిట్‌కాయిన్‌లో రూ.11.20 లక్షలు పెట్టుబడి పెట్టించింది. ఈ కేసులో ఏపీకి చెందిన ఇద్దరిని అరెస్టు చేశామని అడిషనల్సీపీ ఎం.శ్రీనివాసులు తెలిపారు.
